Main Menu

Aligiti Namtaa Nela Atte Nannu Vedukoni (అలిగితి నంటా నేల అట్టే నన్ను వేడుకొని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 489 | Keerthana 469 , Volume 12

Pallavi: Aligiti Namtaa Nela Atte Nannu Vedukoni (అలిగితి నంటా నేల అట్టే నన్ను వేడుకొని)
ARO: Pending
AVA: Pending

Ragam: Bhairavi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అలిగితి నంటా నేల అట్టే నన్ను వేఁడుకొని
తలఁచే నా తలఁపులు తా నెఱుఁగఁడా       ॥ పల్లవి ॥

సతి వద్ద నుండఁగాను చాయ సేసుకొంటీఁ గాక
రతికిఁదాఁ బిలువఁగ రాకుండుదునా
కతలు చెప్పుకోఁగాను కడ నిలుచుండీఁగాక
తతి నూడిగాలకు దగ్గరక వుందునా         ॥ అలి ॥

తెరవేసుకుండఁగా సందేహమున నుంటీఁగాక
అరసి తా వీడె మీఁ గా నంద కుందునా
విరుల వేట్లాడఁగా వింతలు చూచితిఁగాక
గరిమఁదా వలె నంటే కౌఁగిలించకుందునా    ॥ అలి ॥

వేడుక కాఁడై వుండఁగా వేళ దెలిసితి గాక
కూడి పాదా లొత్తుమంటేఁ గొంకివుందునా
యీడనే శ్రీ వేంకటేశుఁడింతలోఁ దా నన్నునేలే
వాడిక దా నడపితే వడి మెచ్చకుందునా     ॥ అలి ॥

Pallavi

Aligiti naṇṭā nēla aṭṭē nannu vēm̐ḍukoni
talam̐cē nā talam̐pulu tā neṟum̐gam̐ḍā

Charanams

1.Sati vadda nuṇḍam̐gānu cāya sēsukoṇṭīm̐ gāka
ratikim̐dām̐ biluvam̐ga rākuṇḍudunā
katalu ceppukōm̐gānu kaḍa nilucuṇḍīm̐gāka
tati nūḍigālaku daggaraka vundunā

2.Teravēsukuṇḍam̐gā sandēhamuna nuṇṭīm̐gāka
arasi tā vīḍe mīm̐ gā nanda kundunā
virula vēṭlāḍam̐gā vintalu cūcitim̐gāka
garimam̐dā vale naṇṭē kaum̐gilin̄cakundunā

3.Vēḍuka kām̐ḍai vuṇḍam̐gā vēḷa delisiti gāka
kūḍi pādā lottumaṇṭēm̐ goṅkivundunā
yīḍanē śrī vēṅkaṭēśum̐ḍintalōm̐ dā nannunēlē
vāḍika dā naḍapitē vaḍi meccakundunā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.