Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 128| Keerthana 164, Volume 7
Pallavi:Amdamaayanayya Nedu (అందమాయనయ్య నేడు)
ARO: Pending
AVA: Pending
Ragam: Sriragam
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అందమాయనయ్య నేఁడు అన్నిటా నీ విభవాలు
చందపు రతులైనవి సంబంధాలు ॥ పల్లవి ॥
కోరి నీమోహపుసతి గుబ్బలవలెనున్నవి
పోరచి నీపెండ్లిలోని బూజగుండలు
చేరి యాపె కుమ్మరించే సిగ్గువలెనున్నది
వేరె యిద్దరినడుమ వేసిన తెర ॥ అంద ॥
ననిచిన యీలేమనవ్వువలెనున్నది
మునుకొని నీశిరసుముత్యాల సేస
చొనిపి యెదురుచూచే చూపులవలెనున్నవి
ఘనముగా వేసుకొన్న కలువలదండలు ॥ అంద ॥
జోడుగాఁ జెలియిచ్చిన సొమ్ములవలెనున్నవి
కూడినవేళ నీమేని గోరొత్తులు
యీడుగా శ్రీ వేంకటేశ యేలితివి నన్నునిట్టె
వేడుకవలెనున్నది విందుల నీమోవి ॥ అంద ॥
Pallavi
Andamāyanayya nēm̐ḍu anniṭā nī vibhavālu
candapu ratulainavi sambandhālu
Charanams
1.Kōri nīmōhapusati gubbalavalenunnavi
pōraci nīpeṇḍlilōni būjaguṇḍalu
cēri yāpe kum’marin̄cē sigguvalenunnadi
vēre yiddarinaḍuma vēsina tera
2.Nanicina yīlēmanavvuvalenunnadi
munukoni nīśirasumutyāla sēsa
conipi yedurucūcē cūpulavalenunnavi
ghanamugā vēsukonna kaluvaladaṇḍalu
3.Jōḍugām̐ jeliyiccina som’mulavalenunnavi
kūḍinavēḷa nīmēni gōrottulu
yīḍugā śrī vēṅkaṭēśa yēlitivi nannuniṭṭe
vēḍukavalenunnadi vindula nīmōvi
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.