Main Menu

Amdaru Neriginave (అందరు నెఱిఁగినవే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 596 | Keerthana 513 , Volume 13

Pallavi: Amdaru Neriginave (అందరు నెఱిఁగినవే)
ARO: Pending
AVA: Pending

Ragam: Bouli Ramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందరు నెఱిఁగినవే అన్నిపనులు
అందియ్యరాదా వీడె మంత సిగ్గులేఁటికి        ॥ పల్లవి ॥

చిప్పిలి చెమటనీరు చెక్కుల వెంటాఁ గారఁగా
చెప్పరాని వూడిగాలు సేసీనాపె
దప్పిదేరే మోవితోడ దగదొట్టి మాటలాడీఁ
గప్పురమైనా నీరాదా కడు సిగ్గులేఁటికి        ॥ అందరు ॥

పెనుఁదురు మట్టే వీడి పిక్కలవెంటా జారఁగా
పెనఁగి నిన్నుఁ బిలిచీ ప్రియురాలు
నినుపు నిట్టూర్పులతో నిలుచుండి నవ్వు నవ్వీ
యెనసి విసరరాదా యింకా సిగ్గులేఁటికి       ॥ అందరు ॥

పూసిన కస్తూరిపూత పొడివొడియై రాలఁగ
అసల నలమేల్మంగ అలమీ నిన్ను
యీసులేక శ్రీవేంకటేశ యేలితివి మమ్ముఁ
జేసుకొన్నపతి వింతే సిగ్గువడనేటికి         ॥ అందరు ॥

Pallavi

Andaru neṟim̐ginavē annipanulu
andiyyarādā vīḍe manta siggulēm̐ṭiki

Charanams

1.Cippili cemaṭanīru cekkula veṇṭām̐ gāram̐gā
cepparāni vūḍigālu sēsīnāpe
dappidērē mōvitōḍa dagadoṭṭi māṭalāḍīm̐
gappuramainā nīrādā kaḍu siggulēm̐ṭiki

2.Penum̐duru maṭṭē vīḍi pikkalaveṇṭā jāram̐gā
penam̐gi ninnum̐ bilicī priyurālu
ninupu niṭṭūrpulatō nilucuṇḍi navvu navvī
yenasi visararādā yiṅkā siggulēm̐ṭiki

3.Pūsina kastūripūta poḍivoḍiyai rālam̐ga
asala nalamēlmaṅga alamī ninnu
yīsulēka śrīvēṅkaṭēśa yēlitivi mam’mum̐
jēsukonnapati vintē sigguvaḍanēṭiki


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.