Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 1005 | Keerthana 29 , Volume 20
Pallavi: Amdarunu Vinaramma (అందరును వినరమ్మ)
ARO: Pending
AVA: Pending
Ragam: Telugu Kambhodhi
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అందరును వినరమ్మ ఆమాఁట
ఆందాలు చెప్పఁగవచ్చీ నమ్మరోయమ్మా ॥ పల్లవి ॥
యీతల నన్ను రమ్మని యేఁటికి బిలిపించెనో
ఆతని నడుగరమ్మా ఆమాఁట
రాతిరెల్లా జాగరాలే రవ్వ కెక్కెఁ బగలెల్లా
చేఁతలేమి సేయవలెఁ జెప్పరోయమ్మా ॥ అంద ॥
పనిలేనిపని కేల పంతమిచ్చెనో కాని
అనఁడా తా నావేళ ఆమాఁట
తనిసె నామనసెల్లాఁ దలకెక్కె వలపెల్లా
ఆనుమానా లేమిగల్లా నాడుమనరమ్మా ॥ అంద ॥
యేకతానఁ జెప్పేనంటా నిందరి మిమ్ముఁ బొమ్మనె
అకడ నప్పుడే వింటి నామాఁట
పైకొని శ్రీవేంకటాద్రిపతి యింతసేసి కూడె
మీకుమీకే యిఁకనైనా మెచ్చుకోరేయమ్మా ॥ అంద ॥
Pallavi
Andarunu vinaram’ma āmām̐ṭa
āndālu ceppam̐gavaccī nam’marōyam’mā
Charanams
1.Yītala nannu ram’mani yēm̐ṭiki bilipin̄cenō
ātani naḍugaram’mā āmām̐ṭa
rātirellā jāgarālē ravva kekkem̐ bagalellā
cēm̐talēmi sēyavalem̐ jepparōyam’mā
2.Panilēnipani kēla pantamiccenō kāni
anam̐ḍā tā nāvēḷa āmām̐ṭa
tanise nāmanasellām̐ dalakekke valapellā
ānumānā lēmigallā nāḍumanaram’mā
3.Yēkatānam̐ jeppēnaṇṭā nindari mim’mum̐ bom’mane
akaḍa nappuḍē viṇṭi nāmām̐ṭa
paikoni śrīvēṅkaṭādripati yintasēsi kūḍe
mīkumīkē yim̐kanainā meccukōrēyam’mā
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.