Main Menu

Amduke Dayavuttu Naatanikini (అందుకే దయవుట్టు నాతనికిని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1808 | Keerthana 43 , Volume 28

Pallavi:Amduke Dayavuttu Naatanikini (అందుకే దయవుట్టు నాతనికిని)
ARO: Pending
AVA: Pending

Ragam:Aahiri
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే దయవుట్టు నాతనికిని
యెందును వనితలకు ఇచ్చకమే మేలు ॥ పల్లవి ॥

గఁటమున రమణుని గడవనాడుటకంటె
మాఁట మాఁటగాఁ బొగడే మచ్చికే మేలు
సాటిబేటికి బొమ్మల జింకించుటకంటే
సూటిగా మోము దప్పక చూచుటే మేలు ॥ అందు ॥

మోనముతోడ ముగము మునుచుకవుండుకంటే
నానఁబెట్టి సెలవుల నవ్వుటే మేలు
ఆనవెట్టుక వెనఁగి అదలించుటకంటే
కానుకిచ్చి వూరకుండే ఘనతే మేలు   ॥ అందు ॥

చేరువనుండి లోలోనే సిగ్గులు వడుటకంటే
కూరిమితేఁ గాఁగిలించుకొనుటే మేలు
గారవించి నిన్ను శ్రీవేంకటేశుఁడు మెచ్చి యేలె
నేరుపుగలదానవు నీకు నిదే మేలు    ॥ అందు ॥


Pallavi

Andukē dayavuṭṭu nātanikini
yendunu vanitalaku iccakamē mēlu

Charanams

1.Gam̐ṭamuna ramaṇuni gaḍavanāḍuṭakaṇṭe
mām̐ṭa mām̐ṭagām̐ bogaḍē maccikē mēlu
sāṭibēṭiki bom’mala jiṅkin̄cuṭakaṇṭē
sūṭigā mōmu dappaka cūcuṭē mēlu

2.Mōnamutōḍa mugamu munucukavuṇḍukaṇṭē
nānam̐beṭṭi selavula navvuṭē mēlu
ānaveṭṭuka venam̐gi adalin̄cuṭakaṇṭē
kānukicci vūrakuṇḍē ghanatē mēlu

3.Cēruvanuṇḍi lōlōnē siggulu vaḍuṭakaṇṭē
kūrimitēm̐ gām̐gilin̄cukonuṭē mēlu
gāravin̄ci ninnu śrīvēṅkaṭēśum̐ḍu mecci yēle
nērupugaladānavu nīku nidē mēlu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.