Main Menu

Amdulone Vunnavi (అందులోనే వున్నవి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 187 | Keerthana 513 , Volume 7

Pallavi: Amdulone Vunnavi (అందులోనే వున్నవి)
ARO: Pending
AVA: Pending

Ragam: Kedara Gowla
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందులోనే వున్నవి ఆయములెల్ల
మందలించనివాఁడవా మతకరివి       ॥ పల్లవి ॥

మన్నించే నీనాలోనొక్కమాటపట్టుకే కదా
నన్ను నిన్నుఁ జూచుకొని నవ్వితి నేఁడు
విన్నపాలిందుకుఁగాను వేగినంతాఁజేయనేల
సన్నెరఁగనివాఁడవా చతురుఁడవు      ॥ అందు ॥

ఇచ్చకపు నీవు సేసే యెన్నికలకే కదా
పచ్చిచేఁతలెల్లాఁజేసి భ్రమసితిని
తచ్చితచ్చియిందులోనే తగవులఁ బెట్టునేల
మచ్చికలేనివాఁడవా మాటకారివి       ॥ అందు ॥

కోరిక నీవుగూడిన కూటములకే కదా
చూరలైన రతులను చొక్కితినిట్టే
యీరీతి శ్రీవెంకటేశ యేలితివి నన్నునిట్టే
మారునితండ్రివి నీవే మండెమురాయఁడవు ॥ అందు ॥


Pallavi

Andulōnē vunnavi āyamulella
mandalin̄canivām̐ḍavā matakarivi

Charanams

1.Mannin̄cē nīnālōnokkamāṭapaṭṭukē kadā
nannu ninnum̐ jūcukoni navviti nēm̐ḍu
vinnapālindukum̐gānu vēginantām̐jēyanēla
sanneram̐ganivām̐ḍavā caturum̐ḍavu

2.Iccakapu nīvu sēsē yennikalakē kadā
paccicēm̐talellām̐jēsi bhramasitini
taccitacciyindulōnē tagavulam̐ beṭṭunēla
maccikalēnivām̐ḍavā māṭakārivi

3.Kōrika nīvugūḍina kūṭamulakē kadā
cūralaina ratulanu cokkitiniṭṭē
yīrīti śrīveṅkaṭēśa yēlitivi nannuniṭṭē
mārunitaṇḍrivi nīvē maṇḍemurāyam̐ḍavu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.