Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 520 | Keerthana 113 , Volume 13
Pallavi: Amdunane Kanugone (అందుననే కనుఁగొనే)
ARO: Pending
AVA: Pending
Ragam: Padi
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అందుననే కనుఁగొనే నతని బత్తి
ఇందువదనరో నాకు నెరిఁగించఁగదవే ॥ పల్లవి ॥
చెప్పిన నావిన్నపము చేకొని వినె నటవే
కప్పురమందె నటవే కానికగాను
ముప్పిరి నందుకుఁగాను మోము చెంగలించె నటే
చిప్పిలి కరఁగి యట్టే చెమరించెనటవే ॥ అందు ॥
వాలాయించి మా ఇంటికివచ్చే ననె నటవే
యేలేనని నిండుబాస లిచ్చె నటవే
మేలువాఁడై కొంత గొంత మేలమాడెనటవే
కీలెఱిఁగి మనమీఁదఁ గృపసేసె నటవే ॥ అందు ॥
ఇందాఁకా శ్రీవేంకటేశుఁ డెదుట నుండె నటవే
అందగాఁడై నాకు సతమాయ నటవే
ఇందరిలో కాఁగిట నన్నేకతానఁ గూడెనటే
చందమాయఁ బనులెల్లా సరివచ్చె నటవే ॥ అందు ॥
Pallavi
Andunanē kanum̐gonē natani batti
induvadanarō nāku nerim̐gin̄cam̐gadavē
Charanams
1.Ceppina nāvinnapamu cēkoni vine naṭavē
kappuramande naṭavē kānikagānu
muppiri nandukum̐gānu mōmu ceṅgalin̄ce naṭē
cippili karam̐gi yaṭṭē cemarin̄cenaṭavē
2.Vālāyin̄ci mā iṇṭikivaccē nane naṭavē
yēlēnani niṇḍubāsa licce naṭavē
mēluvām̐ḍai konta gonta mēlamāḍenaṭavē
kīleṟim̐gi manamīm̐dam̐ gr̥pasēse naṭavē
3.Indām̐kā śrīvēṅkaṭēśum̐ ḍeduṭa nuṇḍe naṭavē
andagām̐ḍai nāku satamāya naṭavē
indarilō kām̐giṭa nannēkatānam̐ gūḍenaṭē
candamāyam̐ banulellā sarivacce naṭavē
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.