Main Menu

Amgadi Kekke Valapu Laaradee (అంగడి కెక్కె వలపు లారడీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 743 | Keerthana 251 , Volume 16

Pallavi:Amgadi Kekke Valapu Laaradee (అంగడి కెక్కె వలపు లారడీ)
ARO: Pending
AVA: Pending

Ragam:Telugu kambhodhi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంగడి కెక్కె వలపు లారడిఁ బడె వయసు-
లెంగిలిమోవు లివిగో యిఁక నేల సిగ్గులు    ॥ పల్లవి ॥

వూరకే నామతిలోన నొకటొకటే తలఁచి
కూరిమి నీకు మరులుగొంటి నేను
చేరి నీ వంతలో నాపైఁ జేతులు చాఁచి చాఁచి
మేరలు మీరఁగఁ బోయి మేను మఱచితివి   ॥ అంగ ॥

నీయింటికి నెడతాఁకి నిచ్చ నిచ్చ పొందు సేసి
మాయల నీతో మాటలే మరిగితిని
బాయట నవ్వులు నవ్వి పచ్చి యేకతాలు చెప్పి
నీయంతనే కిందువడి నెట్టన లోనైతివి    ॥ అంగ ॥

చుట్టమనై వచ్చినీతో జూజములే యాడి ఆడి
గట్టిగా నిన్ను కాఁగిటఁ గలసితిని
యిట్టె శ్రీ వేంకటేశ యెదుట నా మోము చూచి
జట్టిం గరిఁగి కరఁగి చవులెల్లాఁ గంటివి    ॥ అంగ ॥


Pallavi

Aṅgaḍi kekke valapu lāraḍim̐ baḍe vayasu-
leṅgilimōvu livigō yim̐ka nēla siggulu

Charanams

1.Vūrakē nāmatilōna nokaṭokaṭē talam̐ci
kūrimi nīku marulugoṇṭi nēnu
cēri nī vantalō nāpaim̐ jētulu cām̐ci cām̐ci
mēralu mīram̐gam̐ bōyi mēnu maṟacitivi

2.Nīyiṇṭiki neḍatām̐ki nicca nicca pondu sēsi
māyala nītō māṭalē marigitini
bāyaṭa navvulu navvi pacci yēkatālu ceppi
nīyantanē kinduvaḍi neṭṭana lōnaitivi

3.Cuṭṭamanai vaccinītō jūjamulē yāḍi āḍi
gaṭṭigā ninnu kām̐giṭam̐ galasitini
yiṭṭe śrī vēṅkaṭēśa yeduṭa nā mōmu cūci
jaṭṭiṁ garim̐gi karam̐gi cavulellām̐ gaṇṭivi


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.