omposer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 646 | Keerthana 275 , Volume 14
Pallavi: Amganabhaavamu Choodavayya (అంగనభావము చూడవయ్య)
ARO: Pending
AVA: Pending
Ragam:Bouli
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అంగన భావము చూడవయ్య నీవు
యింగితాన నిన్నుఁ జూచి యిట్టె పులకించె ॥పల్లవి॥
సిగ్గుననూరకె వుండె చెలి యంతలో నీవు
దగ్గరఁగా నవ్వు నవ్వె తనలోనే
వెగ్గళించి యట్టె నీవు వెసఁ గాఁగిలించుకోఁగా
నిగ్గులఁ గరఁగుకొంటా నిట్టూరుపు నించెను ॥అంగ॥
కన్నులు తొలుత మూసె కామినినట్టె నీవు
చన్నులు విసుకఁగాను చలి వాసెను
మన్నించి యిప్పటి నీవు మంచముపైకిఁ దియ్యఁగా
చిన్ని చెమటలఁ బొంగి చిత్తము మరచెను ॥అంగ॥
చింతతోడనుండి వుండి చేరి నిన్నుఁ గూడఁగాను
కాంతనెమ్మోమున కళ దేరెను
యింతలో శ్రీవేంకటేశ యింకా నీవు రమ్మనఁగా
సంతసాన విఱ్ఱవీఁగి చనవు మెరసెను ॥అంగ॥
Pallavi
Aṅgana bhāvamu cūḍavayya nīvu
yiṅgitāna ninnum̐ jūci yiṭṭe pulakin̄ce
Charanams
1.Siggunanūrake vuṇḍe celi yantalō nīvu
daggaram̐gā navvu navve tanalōnē
veggaḷin̄ci yaṭṭe nīvu vesam̐ gām̐gilin̄cukōm̐gā
niggulam̐ garam̐gukoṇṭā niṭṭūrupu nin̄cenu
2.Kannulu toluta mūse kāmininaṭṭe nīvu
cannulu visukam̐gānu cali vāsenu
mannin̄ci yippaṭi nīvu man̄camupaikim̐ diyyam̐gā
cinni cemaṭalam̐ boṅgi cittamu maracenu
3.Cintatōḍanuṇḍi vuṇḍi cēri ninnum̐ gūḍam̐gānu
kāntanem’mōmuna kaḷa dērenu
yintalō śrīvēṅkaṭēśa yiṅkā nīvu ram’manam̐gā
santasāna viṟṟavīm̐gi canavu merasenu
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.