Main Menu

Anamtamahimudavu (అనంతమహిముడవు )

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 214 | Keerthana 81 , Volume 3

Pallavi: Anamtamahimudavu (అనంతమహిముడవు )
ARO: Pending
AVA: Pending

Ragam: Desalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అనంతమహిముఁడవు అనంతశ క్తివి నీవు
యెనలేని దైవమా నిన్నేమని నుతింతును ॥ పల్లవి ॥

అన్నిలోకములు నీయందు నున్నవందురు నీ-
వున్నలోక మిట్టిదని వూహించరాదు
యెన్న నీవు రక్షకుఁడ విందరిపాలిటికి
నిన్ను రక్షించేటివారి నేనెవ్వరి నందును ॥ అనం ॥

తల్లివి దండ్రివి నీవు తగు బ్రహ్మాదులకు
యెల్లగా నీతల్లిదండ్రు లెవ్వరందును
యిల్లిదె వరములు నీ విత్తు విందరికిని
చెల్లఁబో నీకొకదాత చెప్పఁగఁ జోటేది    ॥ అనం ॥

జీవుల కేలికవు శ్రీవేంకటేశుఁడవు నీ-
వేవలఁ జూచిన నీ కే యేలికే లేఁడు
వేవేలు మునులును వెదకేరు నిన్నును
నీవెవ్వరి వెదకేవు నిర్మలమూరితివి    ॥ అనం ॥

Pallavi

Anantamahimum̐ḍavu anantaśa ktivi nīvu
yenalēni daivamā ninnēmani nutintunu

Charanams

1.Annilōkamulu nīyandu nunnavanduru nī-
vunnalōka miṭṭidani vūhin̄carādu
yenna nīvu rakṣakum̐ḍa vindaripāliṭiki
ninnu rakṣin̄cēṭivāri nēnevvari nandunu

2.Tallivi daṇḍrivi nīvu tagu brahmādulaku
yellagā nītallidaṇḍru levvarandunu
yillide varamulu nī vittu vindarikini
cellam̐bō nīkokadāta ceppam̐gam̐ jōṭēdi

3.Jīvula kēlikavu śrīvēṅkaṭēśum̐ḍavu nī-
vēvalam̐ jūcina nī kē yēlikē lēm̐ḍu
vēvēlu munulunu vedakēru ninnunu
nīvevvari vedakēvu nirmalamūritivi


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.