Main Menu

Andaalu Sesukolevu Ayyo Neevu (అందాలు సేసుకోలేవు అయ్యో నీవు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1594 | Keerthana 444, Volume 25

Pallavi:Andaalu Sesukolevu Ayyo Neevu (అందాలు సేసుకోలేవు అయ్యో నీవు)
ARO: Pending
AVA: Pending

Ragam: Bouli
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందాలు సేసుకోలేవు అయ్యో నీవు
యిందుముఖి నీసంది యెరవులు గలవా   ॥ పల్లవి ॥

వలసనిజోలబెట్టి వాదు లడిచీఁగాక
అలిగెనా యింతినీతో అప్పటనుండి
చెలరేఁగి మోహమున చిమ్ముచుఁ దిట్టీఁగాక
బలిమిసేయఁగ నీతో పగటా సతికి       ॥అందా॥

తనియనియాసతోడ తప్పకచూచీఁగాక
గునిసి నిన్నాపె నేఁడు కోపగించెనా
మనసుతమకమున మరియూఁ బెనఁగీఁగాక
కినియ నీతో నేమి కేరడమా చెలికి      ॥అందా॥

కరగినమతితోడ కాఁగిలించుకొనీఁగాక
గరువము చూపెనా కాంత నీతోను
అరయ శ్రవేంకటేశ అలమేలుమంగ నిన్ను
యిరవుగఁ గూడెఁగాక యెమ్మెలాయీలేమకు   ॥అందా॥


Pallavi

Andālu sēsukōlēvu ayyō nīvu
yindumukhi nīsandi yeravulu galavā

Charanams

1.Valasanijōlabeṭṭi vādu laḍicīm̐gāka
aligenā yintinītō appaṭanuṇḍi
celarēm̐gi mōhamuna cim’mucum̐ diṭṭīm̐gāka
balimisēyam̐ga nītō pagaṭā satiki

2.Taniyaniyāsatōḍa tappakacūcīm̐gāka
gunisi ninnāpe nēm̐ḍu kōpagin̄cenā
manasutamakamuna mariyūm̐ benam̐gīm̐gāka
kiniya nītō nēmi kēraḍamā celiki

3.Karaginamatitōḍa kām̐gilin̄cukonīm̐gāka
garuvamu cūpenā kānta nītōnu
araya śravēṅkaṭēśa alamēlumaṅga ninnu
yiravugam̐ gūḍem̐gāka yem’melāyīlēmaku


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.