Main Menu

Anduke Nenoo Natte Andaalu (అందుకే నేనూ నట్టే అందాలు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1556 | Keerthana 273 , Volume 25

Pallavi: Anduke Nenoo Natte Andaalu (అందుకే నేనూ నట్టే అందాలు)
ARO: Pending
AVA: Pending

Ragam: Bouli
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే నేనూ నట్టే అందాలు సేసుకొంటి
ఇందుముఖుల చెల్లించ నెన్నఁడు నేరిచెనే ॥ పల్లవి ॥

చలమున సాదించగా చన విచ్చినవాఁడాయ
సెలవిఁ దిట్టితే నవ్వులు సేసుకొనీని
పలుక కూరకుండితే భావము గరఁగె ననీ
యెలమి నిన్నేసివిద్య లెన్నఁడు నేరిచెనే   ॥ అందు ॥

జంకించితే నాకుఁదాను సన్నసేసిన వాఁడాయ
కంకిగ వెంగెమాడితే కతసేసీని
బింకాన నేఁ జూచితేను ప్రియము సేసుకొనీని
ఇంకా మానఁడు మెచ్చీ నెన్నఁడు నేరిచెనే   ॥ అందు ॥

పెనంగితే నంతలోనే బెరసిన వాఁడాయ
గనముగా మొక్కితేను కాఁగిలించీని
మనసిచ్చి యలమేలుమంగను నేనేకనక
యెనసె శ్రీవేంకటేశుఁ డెన్నఁడు నేరిచెనే   ॥ అందు ॥


Pallavi

Andukē nēnū naṭṭē andālu sēsukoṇṭi
indumukhula cellin̄ca nennam̐ḍu nēricenē

Charanams

1.Calamuna sādin̄cagā cana viccinavām̐ḍāya
selavim̐ diṭṭitē navvulu sēsukonīni
paluka kūrakuṇḍitē bhāvamu garam̐ge nanī
yelami ninnēsividya lennam̐ḍu nēricenē

2.Jaṅkin̄citē nākum̐dānu sannasēsina vām̐ḍāya
kaṅkiga veṅgemāḍitē katasēsīni
biṅkāna nēm̐ jūcitēnu priyamu sēsukonīni
iṅkā mānam̐ḍu meccī nennam̐ḍu nēricenē

3.Penaṅgitē nantalōnē berasina vām̐ḍāya
ganamugā mokkitēnu kām̐gilin̄cīni
manasicci yalamēlumaṅganu nēnēkanaka
yenase śrīvēṅkaṭēśum̐ ḍennam̐ḍu nēricenē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.