Main Menu

Annita Nerupariga (అన్నిట నేరుపరిగా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.225 | Keerthana 138 , Volume 3

Pallavi:Annita Nerupariga (అన్నిట నేరుపరిగా)
ARO: Pending
AVA: Pending

Ragam: Ramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Annita Nerupariga | అన్నిట నేరుపరిగా     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిట నేరుపరిగా అలమేలు మంగ నీకు
చిన్నచిన్న ముద్దులనే విడిపించెను

చనవు మెరసి నిన్ను సారెసారె చేరుకుని
మనసు దనియ నాపె మాటలాడెను
కనుసన్న చూపులనె కప్పుర విడెములిచ్చె
దనువు దనియ నీపై తలబాలు వోసెను

పన్నుగడ తొడనే పానుపు చేరువనే
కన్నులు దనియగ దగ్గర నిలచెను
మన్ననలు దైవార మచ్చికలు పెడరేచి
విన్నవీనుల దనియ విన్నపాలు సేసెను

మాగిన మోవి యిచ్చి మనసు గరచి యిట్టే
కౌగిలి దనియ నీకు కప్పె పయ్యెద
వీగక శ్రీ వేంకటేశు వెలది గూడితివిట్టె
రాగి వయసి దనియ రతి కేళి సేసెను

Pallavi

annita nEruparigA alamElu maMga nIku
cinnacinna muddulanE viDipiMcenu

Charanams

1.canavu merasi ninnu sAresAre cErukuni
manasu daniya nApe mATalADenu
kanusanna cUpulane kappura viDemulicce
danuvu daniya nIpai talabAlu vOsenu

2.pannugaDa toDanE pAnupu cEruvanE
kannulu daniyaga daggara nilacenu
mannanalu daivAra maccikalu peDarEci
vinnavInula daniya vinnapAlu sEsenu

3.mAgina mOvi yicci manasu garaci yiTTE
kaugili daniya nIku kappe payyeda
vIgaka SrI vEMkaTESu veladi gUDitiviTTe
rAgi vayasi daniya rati kELi sEsenu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.