Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 70 | Keerthana 365 , Volume 1
Pallavi: AnurenuparipUrnudaina (అణురేణుపరిపూర్ణుడైన)
ARO: Pending
AVA: Pending
Ragam: Sriragam
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
AnurenuparipUrnudaina | అణురేణుపరిపూర్ణుడైన
Voice: B.Govind
Awaiting Contributions.
అణురేణుపరిపూర్ణుడైన శ్రీవల్లభుని
బ్రణుతించువారువో బ్రాహ్మలు ॥ పల్లవి ॥
హరినామములనె సంధ్యాదివిధు లొనరించు-
పరిపూర్ణమతులువో బ్రాహ్మలు
హరిమంత్ర వేదపారాయణులు హరిభక్తి-
పరులైన వారువో బ్రాహ్మలు ॥ అణు ॥
ఏవిచూచినను హరి యిన్నిటా గలడనుచు-
భావించువారువో బ్రాహ్మలు
దేవకీనందనుడె దేవుడని మతిదెలియు-
పావనులు వారువో బ్రాహ్మలు ॥ అణు ॥
ఆదినారాయణుని ననయంబు దమయాత్మ
బాదుకొలిపనవారు బ్రాహ్మలు
వేదరక్షకుడైన వేంకటగిరీశ్వరుని-
పాదసేవకులువో బ్రాహ్మలు ॥ అణు ॥
Pallavi
aNurENuparipUrNuDaina SrIvallaBuni
braNutiMcuvAruvO brAhmalu
Charanams
1.harinAmamulane saMdhyAdividhu lonariMcu-
paripUrNamatuluvO brAhmalu
harimaMtra vEdapArAyaNulu hariBakti-
parulaina vAruvO brAhmalu
2.EvicUcinanu hari yinniTA galaDanucu-
BAviMcuvAruvO brAhmalu
dEvakInaMdanuDe dEvuDani matideliyu-
pAvanulu vAruvO brAhmalu
3.AdinArAyaNuni nanayaMbu damayAtma
bAdukolipanavAru brAhmalu
vEdarakShakuDaina vEMkaTagirISvaruni-
pAdasEvakuluvO brAhmalu
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
The voice is of Sri. B.Govind please.