పద్యం:
సీ. అర్థివాండ్రకు నీక – హాని జేయుట కంటె
దెంపుతో వసనాభి – దినుట మేలు
ఆడుబిడ్డలసొమ్ము – లపహరించుట కంటె
బండ గట్టుక నూత – బడుట మేలు
పరులకాంతల బట్టి – బల్మి గూడుట కంటె
బడబాగ్ని కీలల – బడుట మేలు
బ్రతుకజాలక దొంగ – పనులు చేయుట కంటె
గొంగుతో ముష్టెత్తు – కొనుట మేలు
తే. జలజదళనేత్ర నీ భక్త – జనులతోడి
జగడమాడెడు పనికంటె – జావు మేలు
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |
తాత్పర్యం:
ఓ నరసింహస్వామీ!యాచాకులకు దానమీయకపోగా వారిని చెడగొట్టుటకంటే విషముదిని మరణించుట మేలు. ఆడుబిడ్డల సొమ్ము నపహరించుటకంటే ఒక పెద్దబండరాయిని మెడకు గట్టుకొని నూతిలో పడి మరణించుట మంచిది. పరాయిస్త్రీలను అనుభవించుటకంటె మండే అగ్నిలో పడి చనిపోవుట మేలు.జీవించుట దెలియక దొంగపనులు చేయుటకంటే బిచ్చమెత్తుకొనుట మంచిది.ఓ పద్మనేత్రా!నీ భక్తులతో పోట్లాడుటకంటే మరణమే మేలుకదయ్యా!
.
Poem:
See. Arthivaamdraku Neeka – Haani Jeyuta Kamte
Demputo Vasanaabhi – Dinuta Melu
Aadubiddalasommu – Lapaharimchuta Kamte
Bamda Gattuka Noota – Baduta Melu
Parulakaamtala Batti – Balmi Gooduta Kamte
Badabaagni Keelala – Baduta Melu
Bratukajaalaka Domga – Panulu Cheyuta Kamte
Gomguto Mushtettu – Konuta Melu
Te. Jalajadalanetra Nee Bhakta – Janulatodi
Jagadamaadedu Panikamte – Jaavu Melu
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |
.
see. arthivaaMDraku neeka – haani jEyuTa kaMTe
deMputO vasanaabhi – dinuTa mElu
aaDubiDDalasommu – lapahariMchuTa kaMTe
baMDa gaTTuka noota – baDuTa mElu
parulakaaMtala baTTi – balmi gooDuTa kaMTe
baDabaagni keelala – baDuTa mElu
bratukajaalaka doMga – panulu chEyuTa kaMTe
goMgutO muShTettu – konuTa mElu
tE. jalajadaLanEtra nee bhakta – janulatODi
jagaDamaaDeDu panikaMTe – jaavu mElu
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |
.
No comments yet.