Main Menu

Asaputte Sriramulato (ఆశపుట్టె శ్రీరాములతో)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Anamdabhairavi

Arohana :Sa Ga Ri Ga Ma Pa Dha Pa Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Sa

Taalam: Eka

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)


Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

ఆశపుట్టె శ్రీరాములతో ఆహానే పుట్టనైతి
రఘురాములతోనే పుట్టనైతి
శ్రీరాములతో బుట్టి సేవలు సేయగనైతిని
దశరథనందుడై దాశరథి రాములవశముగ బాలురతో
వరదుడై యాడగ వనజనాభునకు దాసుడనై నే భయభక్తితోడ

చరణములు

1.సకల సేవలుసల్పుచుమురియును అకటనలుగురితోనాడుకొనుదుగద
అయోధాపురిలో గజమునెక్కి అత్యుతుండు రాగాను నాట్యమాడుచు
నన్ను రక్షింపుమంచును విశ్వామిత్రుని వెంటపో నేనునుపోదును
జనకుడు హరికి

2.జానకిని పెండ్లడగ వారిద్దరికి నే శెషబియ్యము నిత్తును
అమ్మవారికి ఆకులమడచి యిత్తును నరులార యితడే నారాయణుడని
చాటుదును

3.మనలను రక్షించే మాధవుదు వచ్చేనందును మన గతి యేమందు
ప్రభు దశరథునే బతిమాలుదుగద కైకేయిని నే గాదనందుగద
రామునికైన రాజ్యమిత్తుగద ప్రభవయి యేలగ నేనొర్తుగద
అడవికి బోవ నంటిపోదుగద గుహునితో గూడుక కూది మురియుదుగద

4.నిల్చి దానవుల నెత్తి గొట్టుదుగద కరయుద్ధంబున గౌగలింతుగద
కనకమృగమును రామకాంత తెమ్మంటె ఓ నిర్దయులార అయ్యోనేపోయి
ఆ మృగమును దెచ్చి అమ్మకిత్తుగద హరిని నేనుపోదందునుగద
ఏ మృగమువెంట, దశముఖు డంతట తపోవేషమున
దశముఖు తన శౌర్యముజూపగ ఝానకి వణకగ ఆ రావణుడు సీతమ్మను చెరపట్టగ

4.అప్పుడు నేనుంటే అమ్మ కభయ మిత్తును
ఆ శ్రీపాదములునట్టే పట్టుకనే మ్రొక్కుదును
హరి దుఃఖింపగ అమ్మజూడ దెత్తును
సర్వజ్ఞ్మూర్తి చాలు నీ విరహమందును
విశ్వములో నందరు విన నట్లూరకుండిరీ
సురవరులందరు సుఖంబుగ జూచుచుండిరి
అయ్యోయిదేమని ఆ బ్రహ్మాదుల శపింతునుగద

5.జేరి విభీషణ మహాత్మయనగా అర్థికపులు హరిగోవిందయనగ
బ్రహ్మాదులు హరి ప్రస్తుతింపగా తల్లిమారుతికి దండవేయగ
నా తల్లియపుదు నాకును వేయునుగద కష్టపడితినని కరుణించుగద
సీతారాములు సిరులిత్తురుగద

.


Pallavi

ASapuTTe SrIrAmulatO AhAnE puTTanaiti
raghurAmulatOnE puTTanaiti
SrIrAmulatO buTTi sEvalu sEyaganaitini
daSarathananduDai dASarathi rAmulavaSamuga bAluratO
varaduDai yADaga vanajanAbhunaku dAsuDanai nE BayaBaktitODa

Charanams

1.sakala sEvalusalpucumuriyunu akaTanaluguritOnADukonudugada
ayOdhApurilO gajamunekki atyutunDu rAgAnu nATyamADucu
nannu rakshimpumancunu viSwAmitruni venTapO nEnunupOdunu
janakuDu hariki

2.jAnakini penDlaDaga vAriddariki nE Seshabiyyamu nittunu
ammavAriki AkulamaDaci yittunu narulAra yitaDE nArAyaNuDani
cATudunu

3.manalanu rakshincE mAdhavudu vaccEnandunu mana gati yEmandu
praBu daSarathunE batimAludugada kaikEyini nE gAdanandugada
rAmunikaina rAjyamittugada praBavayi yElaga nEnortugada
aDaviki bOva nanTipOdugada guhunitO gUDuka kUdi muriyudugada

4.nilci dAnavula netti goTTudugada karayuddhanbuna gougalintugada
kanakamRgamunu rAmakAnta temmanTe O nirdayulAra ayyOnEpOyi
A mRgamunu decci ammakittugada harini nEnupOdandunugada
E mRgamuvenTa, daSamuKu DantaTa tapOvEshamuna
daSamuKu tana SouryamujUpaga JAnaki vaNakaga A rAvaNuDu sItammanu cerapaTTaga

4.appuDu nEnunTE amma kaBaya mittunu
A SrIpAdamulunaTTE paTTukanE mrokkudunu
hari du@hKinpaga ammajUDa dettunu
sarvaj~nmUrti cAlu nI virahamandunu
viSvamulO nandaru vina naTlUrakunDirI
suravarulandaru suKambuga jUcucunDiri
ayyOyidEmani A brahmAdula Sapintunugada

5.jEri viBIshaNa mahAtmayanagA arthikapulu harigOvindayanaga
brahmAdulu hari prastutimpagA tallimArutiki danDavEyaga
nA talliyapudu nAkunu vEyunugada kashTapaDitinani karuNincugada
sItArAmulu sirulitturugada

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.