Main Menu

Ayyayyo nedella (అయ్యయ్యో నేడెల్ల)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Varali

39 jhaalavaraaLi janya
Arohana : S G1 R1 G1 M2 P D1 N3 S
Avarohana : S N3 D1 P M2 G1 R1 S

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| అయ్యయ్యో నేడెల్ల ఈజీవునకు సుఖ- | మెయ్యెడ లేదుగదా రామయ్య ||

అనుపల్లవి

|| చయ్యన రఘుకుల సార్వభౌమా ఏ- | చందాన బ్రోచెదవో రామయ్య ||

చరణములు

|| వనజ నాభునిమాయ తెలియకనే నెట్టి | వగలబొందుచుంటిగా కొన్నాళ్ళు ||

|| మునుపుచేసిన పుణ్య పాప సంఘములచే | మునిగి తేలుచుంటిగా కొన్నాళ్ళు ||

|| ఎనుబది నాలుగు లక్షల యోనులందెల్ల | వేసరక పుటితిగా కొన్నాళ్ళు ||

|| అయ్య ఆలంబనము లేక నాకాశమున | నలసట నొందితిగా కొన్నాళ్ళు ||

|| మేను తెలియగలేక మిన్నులోపల చిక్కి | మినుకుగ నుంటినిగదా కొన్నాళ్ళు ||

|| ఈలాగు వచ్చి మేఘ మధ్యమునందు | నిడుమల బడుచుంటిగా కొన్నాళ్ళు ||

|| జాలినొంద సూర్య కిరణములో జొచ్చి | చలనము నొందితిగదా కొన్నాళ్ళు ||

|| వర్షములో జిక్కి వసుమతి మీదను | వర్తించుచుంటి గదా కొన్నాళ్ళు ||

|| వరుస శేషసస్య గతమైన ధాన్యముల | వదలి వర్తించి గదా కొన్నాళ్ళు ||

|| పురుషు డారగించు నన్నముతోనె | నట్టు జేరియుంటిగా కొన్నాళ్ళు ||

|| వరనరుని రేతస్సు వల్ల నారీగర్భ | నరమున బడియుంటిగా కొన్నాళ్ళు ||

|| ఆ త్రిపుడు తిత్తి లో పది నెలలు | ప్రవర్తించుటినిగా కొన్నాళ్ళు ||

|| అప్పుడు మాతల్లి యుప్పుపులుసు దిన | నంగలార్చుచుంటి గదా కొన్నాళ్ళు ||

|| ఎపుడు నిందుండి బయలు వెళ్ళుదునని | ఎదురు చూచుచుంటిగదా కొన్నాళ్ళు ||

|| చెప్పరానియట్టి ద్వారములోను పడి | జననమొందితిని గదా రామయ్య ||

|| పొరలు దుర్గంధపు పొత్తిళ్ళలో నలిగి | వరలుచునుంటిగదా కొన్నాళ్ళు ||

|| పెరుగుచు బాల్యాద్వస్థల కొన్ని దినములు | పరుగులాడుచునుంటిగా కొన్నాళ్ళు ||

|| లేతతరుణులతో కూడి మదమత్సరంబులు | తన్నెరుగ లేనైతినిగదా కొన్నాళ్ళు ||

|| తరువాత దార పుత్రాది మోహముల | తగిలి వర్తింపగదా ఓ రామ ||

|| తెల్ల తెల్లనైన దంతములూడి వణకుచు | తడబడుచుంటిగదా కొన్నాళ్ళు ||

|| బలముతీరి కండ్లు పొరలుగన్న పరుల | బ్రతిమాలుచుంటి గదా కొన్నాళ్ళు ||

|| అంతట మౄతినొంది యలయుచు యమునిచే | బాధబొందితి గదా కొన్నాళ్ళు ||

|| ఎంతగా నీరీతి పుట్టుచు గిట్టుచు | వేదనబడుచుంటిగా కొన్నాళ్ళు ||

|| కంజ జనక భద్రాచలపతివగు నిన్ను | గనలేక దిరిగితిగదా కొన్నాళ్ళు ||

|| వింతగ నే రామ దాసుడనైతిని | యింకెట్లు బ్రోచెదవో ఓ రామ ||

.


Pallavi

|| ayyayyO nEDella IjIvunaku suKa- | meyyeDa lEdugadA rAmayya ||

Anupallavi

|| cayyana raGukula sArvaBaumA E- | caMdAna brOcedavO rAmayya ||

Charanams

|| vanaja nABunimAya teliyakanE neTTi | vagalaboMducuMTigA konnALLu ||

|| munupucEsina puNya pApa saMGamulacE | munigi tElucuMTigA konnALLu ||

|| enubadi nAlugu lakShala yOnulaMdella | vEsaraka puTitigA konnALLu ||

|| ayya AlaMbanamu lEka nAkASamuna | nalasaTa noMditigA konnALLu ||

|| mEnu teliyagalEka minnulOpala cikki | minukuga nuMTinigadA konnALLu ||

|| IlAgu vacci mEGa madhyamunaMdu | niDumala baDucuMTigA konnALLu ||

|| jAlinoMda sUrya kiraNamulO jocci | calanamu noMditigadA konnALLu ||

|| varShamulO jikki vasumati mIdanu | vartiMcucuMTi gadA konnALLu ||

|| varusa SEShasasya gatamaina dhAnyamula | vadali vartiMci gadA konnALLu ||

|| puruShu DAragiMcu nannamutOne | naTTu jEriyuMTigA konnALLu ||

|| varanaruni rEtassu valla nArIgarBa | naramuna baDiyuMTigA konnALLu ||

|| A tripuDu titti lO padi nelalu | pravartiMcuTinigA konnALLu ||

|| appuDu mAtalli yuppupulusu dina | naMgalArcucuMTi gadA konnALLu ||

|| epuDu niMduMDi bayalu veLLudunani | eduru cUcucuMTigadA konnALLu ||

|| cepparAniyaTTi dvAramulOnu paDi | jananamoMditini gadA rAmayya ||

|| poralu durgaMdhapu pottiLLalO naligi | varalucunuMTigadA konnALLu ||

|| perugucu bAlyAdvasthala konni dinamulu | parugulADucunuMTigA konnALLu ||

|| lEtataruNulatO kUDi madamatsaraMbulu | tanneruga lEnaitinigadA konnALLu ||

|| taruvAta dAra putrAdi mOhamula | tagili vartiMpagadA O rAma ||

|| tella tellanaina daMtamulUDi vaNakucu | taDabaDucuMTigadA konnALLu ||

|| balamutIri kaMDlu poraluganna parula | bratimAlucuMTi gadA konnALLu ||

|| aMtaTa mRutinoMdi yalayucu yamunicE | bAdhaboMditi gadA konnALLu ||

|| eMtagA nIrIti puTTucu giTTucu | vEdanabaDucuMTigA konnALLu ||

|| kaMja janaka BadrAcalapativagu ninnu | ganalEka dirigitigadA konnALLu ||

|| viMtaga nE rAma dAsuDanaitini | yiMkeTlu brOcedavO O rAma ||

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.