Main Menu

Baramulannitiki niveyanucu (భారములన్నిటికి నీవెయనుచు)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Anamdabairavi

Taalam: Triputa

Language: Telugu (తెలుగు)




Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)


Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| భారములన్నిటికి నీవెయనుచు నిర్భయుండనై యున్నానురా శ్రీరామా ||

అనుపల్లవి

|| దారి తప్పక నీవు దరివని ధైర్యము తోచినదిరా శ్రీరామా ||

చరణములు

|| అతి దుష్కౄతముల నెన్నో నే చేసితిని | అయిన మరేమాయెరా రామా |
పతితపావనుడను బిరుదువహించిన నీ | ప్రఖ్యాతి విన్నానురా శ్రీరామా ||

|| ఏరీతినైన నే నిన్ను నమ్మియున్నాడ న | న్నేలుకొనుట కీర్తిరా రామా |
నేరను నేరము లెంచి చూచుటకు | నే నెంతవాడనుర శ్రీరామా ||

|| మును నిను జేరి కౄతార్థులైన వారి | ముచ్చట విన్నానురా రామా |
విని విననట్లున్నావేమిరా పలుమారు | విన్నవించ నేరనుర శ్రీరామా ||

|| శరణన్నవారి రక్షణచేయు బిరుదు | నిశ్చయమై నీకున్నదిర రామా |
మురిపెముగా నన్నిటికి నేపట్టినది | మునగ కొమ్మ గాదురా శ్రీరామా ||

|| బహువిధముల నిన్ను ప్రస్తుతించమని | బ్రహ్మ వ్రాసినాడురా రామ |
విహితజనముల లోనే నెవ్వడోయని | వేరుచేయక బ్రోవరా శ్రీరామా ||

|| వాసిగ భద్రాచలేశుడవని చాల | వర్ణించు చున్నానురా రామ |
భాసురముగ రామదాసు నేలునట్టి | భావముగన్నానురా శ్రీరామా ||

.


Pallavi

|| BAramulanniTiki nIveyanucu nirBayuMDanai yunnAnurA SrIrAmA ||

Anupallavi

|| dAri tappaka nIvu darivani dhairyamu tOcinadirA SrIrAmA ||

Charanams

|| ati duShkRutamula nennO nE cEsitini | ayina marEmAyerA rAmA |
patitapAvanuDanu biruduvahiMcina nI | praKyAti vinnAnurA SrIrAmA ||

|| ErItinaina nE ninnu nammiyunnADa na | nnElukonuTa kIrtirA rAmA |
nEranu nEramu leMci cUcuTaku | nE neMtavADanura SrIrAmA ||

|| munu ninu jEri kRutArthulaina vAri | muccaTa vinnAnurA rAmA |
vini vinanaTlunnAvEmirA palumAru | vinnaviMca nEranura SrIrAmA ||

|| SaraNannavAri rakShaNacEyu birudu | niScayamai nIkunnadira rAmA |
muripemugA nanniTiki nEpaTTinadi | munaga komma gAdurA SrIrAmA ||

|| bahuvidhamula ninnu prastutiMcamani | brahma vrAsinADurA rAma |
vihitajanamula lOnE nevvaDOyani | vErucEyaka brOvarA SrIrAmA ||

|| vAsiga BadrAcalESuDavani cAla | varNiMcu cunnAnurA rAma |
BAsuramuga rAmadAsu nElunaTTi | BAvamugannAnurA SrIrAmA ||

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.