Main Menu

Bhujabalambuna Beddapulula Jampagavacchu (భుజబలంబున బెద్ద – పులుల జంపగవచ్చు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. భుజబలంబున బెద్ద – పులుల జంపగవచ్చు
పాముకంఠము జేత – బట్టవచ్చు
బ్రహ్మ రాక్షసకోట్ల – బాఱద్రోలగవచ్చు
మనుజుల రోగముల్ – మాన్పవచ్చు
జిహ్వ కిష్టముగాని – చేదు మ్రింగగవచ్చు
బదను ఖడ్గము చేత – నదమవచ్చు
గష్టమొందుచు ముండ్ల – కంపలో జొరవచ్చు
దిట్టుబోతుల నోళ్లు – కట్టవచ్చు

తే. బుడమిలో దుష్టులకు ఙ్ఞాన – బోధ తెలిపి
సజ్జనుల జేయలే డెంత – చతురుదైన.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహా!భుజబలముతో పెద్దపులులను జంపవచ్చు,పాముకంఠాన్ని చేతితో పట్టుకోవచ్చును, బ్రహ్మరాక్షసులను పారద్రోలవచ్చు. మనిషి రోగములను మాన్పవచ్చు. ప్రియములేని చేదును మ్రింగవచ్చు. పదునైన కత్తిని చేత్తో నదిమిపెట్టవచ్చు. కష్టమైననూ ముండ్ల కంపలో దూకవచ్చు. చెడువాగుడు కాయల నోళ్ళు నరికట్టవచ్చు. కాని ఈ భూమియందు దైవోపదేశము దుర్జనులను సజ్జనుల చేయుట ఎంతటి సమర్ధునికైననూ నలవికాదుగదా!
.


Poem:
See. Bhujabalambuna Bedda – Pulula Jampagavachchu
Paamukamthamu Jeta – Battavachchu
Brahma Raakshasakotla – Baarxadrolagavachchu
Manujula Rogamul – Maanpavachchu
Jihva Kishtamugaani – Chedu Mrimgagavachchu
Badanu Khadgamu Cheta – Nadamavachchu
Gashtamomduchu Mumdla – Kampalo Joravachchu
Dittubotula Nollu – Kattavachchu

Te. Budamilo Dushtulaku Gnyaana – Bodha Telipi
Sajjanula Jeyale Demta – Chaturudaina.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. bhujabalaMbuna bedda – pulula jaMpagavachchu
paamukaMThamu jEta – baTTavachchu
brahma raakShasakOTla – baarxadrOlagavachchu
manujula rOgamul – maanpavachchu
jihva kiShTamugaani – chEdu mriMgagavachchu
badanu khaDgamu chEta – nadamavachchu
gaShTamoMduchu muMDla – kaMpalO joravachchu
diTTubOtula nOLlu – kaTTavachchu

tE. buDamilO duShTulaku gnyaana – bOdha telipi
sajjanula jEyalE DeMta – chaturudaina.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.