రాజకీయ సిద్ధాంతాలు, సామాజిక బాధ్యత, ప్రజా సంక్షేమం, నైతిక విలువలు వంటి పదాలు రాజకీయ రంగంలో బూతుమాటలయి ఎన్నాళ్లయింది? ఈ మధ్య ఏ నాయకులయినా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? పోనీ, అసలు ఇలాంటి మాటలకు వీరికి అర్థం తెలుసా? ముందు ముందు రాబోయే వారాలలో వీటి వెక్కిరింతని మరింతగా చూడబోతున్నాం. నేను రాజకీయ జంతువుని కాను. ఒక మామూలు కాలమిస్టుని. రాజకీయ సిద్ధాంతాలు కాక, రాజకీయ మనుగడకోసం ఇప్పుడిప్పుడు ఎంతమంది కప్పదాట్లు వేస్తున్నారో ప్రతిదినం మనం పత్రికల్లో […]
Gollapudi columns ~ Napumsaka Pumsatvam..! (‘నపుంసక ‘ పుంసత్వం ..!)
