Main Menu

Challanai Kayagado (చల్లనై కాయగదో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 228

Copper Sheet No. 69

Pallavi: Challanai Kayagado (చల్లనై కాయగదో)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| చల్లనై కాయగదో చందమామ | వెల్లిగా తిరి వేంకటేశు నెదుట ||
అప|| మొల్లమిగ నమృతంపు వెల్లిగొలుపుచు లోక- | మెల్ల నిను కొనియాడగా ||

Charanams

|| పొందైన హితులు నాప్తులు రసికులు కవులు | అందముగ నును మాటలాడ నేర్చిన ఘనులు |
చిందులకు నాడేటి సీమంతి మణులు | చెలగి ఇరుగడ కొలువగాను |
వంది మాగధులు కైవారింప తన దివ్య | మందిరో పాంత మార్గమున కోనేటి |
ముందుటను కడు మంద మంద ప్రయాణముల | ఇందిరాపతి మెరయగాను ||

|| ఏకాంత సుఖగోష్ఠి నేప్రొద్దు మానవా- | నీకంబు లెడ గలిసి నిలిచి సేవింప గాం- |
తా కదంబములు హస్తముల కంకణ ఝణ- | త్కారములు నిగుడ చామరము లిడగ |
జోకైన మణిగణ స్తోమాంకితంబులై | సొంపుపొందు నాలవట్టములు కరములు దాల్చి |
యేకాంతు లిరువంక నెదిరి కొలువగ సకల | లోకేశ్వరుడు మెరయగాను ||

|| బంగారు ప్రతిమలకు వ్రతులైన దివిజ లో- | కాంగనలు ఘన విమానాంగణంబున నుండి |
చెంగలువలును మంచి చేమంతి రేకులును | చెలగి యిరుగడ చల్లగాను |
మంగళాత్మకము లగు మహిత వేదాంత వే- | దాంగ విద్యలకు ప్రియమంది చేకొనుచు తిరు- |
వేంగళేశుండు కడు వేడుకల తోడ తిరు- | వీధులను విహరింపగాను ||

.


Pallavi

|| callanai kAyagadO caMdamAma | velligA tiri vEMkaTESu neduTa ||
apa|| mollamiga namRutaMpu velligolupucu lOka- | mella ninu koniyADagA ||

Charanams

|| poMdaina hitulu nAptulu rasikulu kavulu | aMdamuga nunu mATalADa nErcina Ganulu |
ciMdulaku nADETi sImaMti maNulu | celagi irugaDa koluvagAnu |
vaMdi mAgadhulu kaivAriMpa tana divya | maMdirO pAMta mArgamuna kOnETi |
muMduTanu kaDu maMda maMda prayANamula | iMdirApati merayagAnu ||

|| EkAMta suKagOShThi nEproddu mAnavA- | nIkaMbu leDa galisi nilici sEviMpa gAM- |
tA kadaMbamulu hastamula kaMkaNa JaNa- | tkAramulu niguDa cAmaramu liDaga |
jOkaina maNigaNa stOmAMkitaMbulai | soMpupoMdu nAlavaTTamulu karamulu dAlci |
yEkAMtu liruvaMka nediri koluvaga sakala | lOkESvaruDu merayagAnu ||

|| baMgAru pratimalaku vratulaina divija lO- | kAMganalu Gana vimAnAMgaNaMbuna nuMDi |
ceMgaluvalunu maMci cEmaMti rEkulunu | celagi yirugaDa callagAnu |
maMgaLAtmakamu lagu mahita vEdAMta vE- | dAMga vidyalaku priyamaMdi cEkonucu tiru- |
vEMgaLESuMDu kaDu vEDukala tODa tiru- | vIdhulanu vihariMpagAnu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.