Main Menu

Deha Munnavarrakumoohasaagaramandhu (దేహ మున్నవఱకుమోహసాగరమందు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. దేహ మున్నవఱకు – మోహసాగరమందు
మునుగుచుందురు శుద్ధ – మూఢజనులు
సలలితైశ్వర్యముల్ – శాశ్వతం బనుకొని
షడ్భ్రమలను మాన – జాల రెవరు
సర్వకాలము మాయ – సంసార బద్ధులై
గురుని కారుణ్యంబు గోరుకొనరు
ఙ్ఞాన భక్తి విరక్తు – లైన పెద్దల జూచి
నింద జేయక – తాము నిలువలేరు

తే. మత్తులైనట్టి దుర్జాతి – మనుజులెల్ల
నిన్ను గనలేరు మొదటికే – నీరజాక్ష.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహా!ఈ మూఢజనులు దేహమున్నంతవరకు మోహ సాగరమున మునిగి తమకున్న ఐశ్వర్యములు శాశ్వతమనుకొని కామక్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనెడి అరిషడ్వర్గము లను జయించపొందలేకున్నారు.ఈ మాయాసంసారము నందు జిక్కి గురువుయొక్క కరుణను పొందలేకున్నారు. జ్ఞానులను, విజ్ఞానులను, భక్తులను, యోగీశ్వరులను చూచి హేళన చేతురేగాని,ఓ నీరజాక్ష!ఐశ్వర్య గర్వమదాందులై ఈ మూఢజనులు నిన్ను తెలుసుకోలేకున్నారయ్యా!
.


Poem:
See. Deha Munnavarxaku – Mohasaagaramamdu
Munuguchumduru Suddha – Moodhajanulu
Salalitaisvaryamul – Saasvatam Banukoni
Shadbhramalanu Maana – Jaala Revaru
Sarvakaalamu Maaya – Samsaara Baddhulai
Guruni Kaarunyambu Gorukonaru
Gnyaana Bhakti Viraktu – Laina Peddala Joochi
Nimda Jeyaka – Taamu Niluvaleru

Te. Mattulainatti Durjaati – Manujulella
Ninnu Ganaleru Modatike – Neerajaaksha.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. dEha munnavarxaku – mOhasaagaramaMdu
munuguchuMduru Suddha – mooDhajanulu
salalitaiSvaryamul – SaaSvataM banukoni
ShaDbhramalanu maana – jaala revaru
sarvakaalamu maaya – saMsaara baddhulai
guruni kaaruNyaMbu gOrukonaru
gnyaana bhakti viraktu – laina peddala joochi
niMda jEyaka – taamu niluvalEru

tE. mattulainaTTi durjaati – manujulella
ninnu ganalEru modaTikE – neerajaakSha.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.