Main Menu

Elalona Nea Janmamethinappatinindi (ఇలలోన నే జన్మమెత్తినప్పటినుండి)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. ఇలలోన నే జన్మ – మెత్తినప్పటినుండి
బహు గడించితినయ్య – పాతకములు
తెలిసి చేసితి గొన్ని – తెలియజాలక చేసి
బాధ నొందితి నయ్య – పద్మనాభ
అనుభవించెడు నప్పు – దతి ప్రయాసంబంచు
బ్రజలు చెప్పగ జాల – భయము గలిగె
నెగిరి పోవుటకునై – యే యుపాయంబైన
జేసి చూతమటన్న – జేతగాదు

తే. సూర్యశశినేత్ర | నీచాటు – జొచ్చి నాను
కలుషములు ద్రుంచి నన్నేలు – కష్టమనక.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ ఇందీవరశ్యామా!పుండరీకాక్షా!ఈ పుడమిపై పడినప్పటినుండి తెలిసో తెలియకో పెక్కుపాపములు నంటగొట్టుకొంటిని. చాలా వ్యధనొందియున్నాను తండ్రీ! ఓ పద్మనాభా! కష్టములను భరించుట చాలా కష్టమని ప్రజలు చెప్పగ కడుభీతినొందితిని.కష్టనివారణోపాయము చేతకానున్నది.సూర్యశశినేత్రా!నీ చెంతకు వచ్చాను.కష్టమనుకొనక నా పాపములు బాపి నన్ను బ్రోవుమో నారసింహా!
.


Poem:
See. Ilalona Ne Janma – Mettinappatinumdi
Bahu Gadimchitinayya – Paatakamulu
Telisi Chesiti Gonni – Teliyajaalaka Chesi
Baadha Nomditi Nayya – Padmanaabha
Anubhavimchedu Nappu – Dati Prayaasambamchu
Brajalu Cheppaga Jaala – Bhayamu Galige
Negiri Povutakunai – Ye Yupaayambaina
Jesi Chootamatanna – Jetagaadu

Te. Sooryasasinetra | Neechaatu – Jochchi Naanu
Kalushamulu Drumchi Nannelu – Kashtamanaka.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. ilalOna nE janma – mettinappaTinuMDi
bahu gaDiMchitinayya – paatakamulu
telisi chEsiti gonni – teliyajaalaka chEsi
baadha noMditi nayya – padmanaabha
anubhaviMcheDu nappu – dati prayaasaMbaMchu
brajalu cheppaga jaala – bhayamu galige
negiri pOvuTakunai – yE yupaayaMbaina
jEsi chootamaTanna – jEtagaadu

tE. sooryaSaSinEtra | neechaaTu – jochchi naanu
kaluShamulu druMchi nannElu – kaShTamanaka.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.