Pallavi || ఏమీ నెఱగనినా కేడపుణ్యము | తామసుండజుమ్మీ ముందరనున్న దైవమా || Charanams || పాతకపుజేతలనే పట్టి నిన్ను బూజించు- | ఘాతకుడ నాకు నెక్కడిపుణ్యము | చేతనము బోదిసేయుచిత్తము నీదేకాన | రాతిబొమ్మజుమ్మీ భారము నీది దైవమా || || పూనినయెంగిలినోర నొప్పగునిన్ను బొగడు- | హీనజంతువునకు నా కేటిపుణ్యము | తేనెపూసి నీవిట్లా దిప్పగానే తిరిగేటి- | మానిబొమ్మజుమ్మీ నామతిలోని దైవమా || || జాలిబడి సంసారజలధిలో మునిగేటి- | కూళడ నాకేటితేకువపుణ్యము | పాలువోసి పెంచిన నాపాలివేంకటేశ నే | తోలిబొమ్మజుమ్మీ కాతువుగాని దైవమా || .
Pallavi || EmI nerxaganinA kEDapuNyamu | tAmasuMDajummI muMdaranunna daivamA || Charanams || pAtakapujEtalanE paTTi ninnu bUjiMcu- | GAtakuDa nAku nekkaDipuNyamu | cEtanamu bOdisEyucittamu nIdEkAna | rAtibommajummI BAramu nIdi daivamA || || pUninayeMgilinOra noppaguninnu bogaDu- | hInajaMtuvunaku nA kETipuNyamu | tEnepUsi nIviTlA dippagAnE tirigETi- | mAnibommajummI nAmatilOni daivamA || || jAlibaDi saMsArajaladhilO munigETi- | kULaDa nAkETitEkuvapuNyamu | pAluvOsi peMcina nApAlivEMkaTESa nE | tOlibommajummI kAtuvugAni daivamA || .
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know. .
No comments yet.