Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 284
Copper Sheet No. 46
Pallavi: Ennibadhalabetti yecedavu (ఎన్నిబాధలబెట్టి యేచెదవు)
Ragam: Sriragam
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఎన్నిబాధలబెట్టి యేచెదవు నీవింక యెంతకాలముదాక కర్మమా|
మన్నించుమనుచు నీమరుగు జొచ్చితిమి మామాటాలకించవో కర్మమా ||
Charanams
|| ప్రతిలేని దురితముల పాలుసేయక నన్ను పాలించవైతివో కర్మమా |
తతితోడ నాత్మపరితాపంబు తోడుతను తగులేల చేసితివో కర్మమా |
జితకాములకుగాని చేతికిని లోనయి చిక్కవేకాలంబు కర్మమా |
మతిహీనులైనట్టి మాకునొక పరిపాటి మార్గంబు చూపవో కర్మమా ||
|| ఆసలనియెడి తాళ్ళ నంటగట్టుక విధికి నప్పగించితివిగదె కర్మమా |
వాసి విడిచితిమి నీవారమైతిమి మమ్ము వన్నె చెడనీకువో కర్మమా |
కాసుకును గొరగాని గతిలేని పనికిగా కాలూదనీవేల కర్మమా |
ఓసరించొక మారు వొయ్యనే వొకరీతి నొల్లనని తలగుమీ కర్మమా ||
|| తిరువేంకటాచలాధిపుని మాయలచేత దెసల దిరిగినయట్టి కర్మమా |
హరిదాసులగువారి నాదరింతువుగాక అంత నొప్పింతువా కర్మమా |
వరుస నేనుగుమీదివాని సున్నంబడుగ వచ్చునా నీకిట్ల కర్మమా |
పరమపురుషోత్తముని భ్రమతబడి నీవిట్ల బట్టబయలైతిగా కర్మమా ||
.
Pallavi
|| ennibAdhalabeTTi yEcedavu nIviMka yeMtakAlamudAka karmamA|
manniMcumanucu nImarugu joccitimi mAmATAlakiMcavO karmamA ||
Charanams
|| pratilEni duritamula pAlusEyaka nannu pAliMcavaitivO karmamA |
tatitODa nAtmaparitApaMbu tODutanu tagulEla cEsitivO karmamA |
jitakAmulakugAni cEtikini lOnayi cikkavEkAlaMbu karmamA |
matihInulainaTTi mAkunoka paripATi mArgaMbu cUpavO karmamA ||
|| AsalaniyeDi tALLa naMTagaTTuka vidhiki nappagiMcitivigade karmamA |
vAsi viDicitimi nIvAramaitimi mammu vanne ceDanIkuvO karmamA |
kAsukunu goragAni gatilEni panikigA kAlUdanIvEla karmamA |
OsariMcoka mAru voyyanE vokarIti nollanani talagumI karmamA ||
|| tiruvEMkaTAcalAdhipuni mAyalacEta desala diriginayaTTi karmamA |
haridAsulaguvAri nAdariMtuvugAka aMta noppiMtuvA karmamA |
varusa nEnugumIdivAni sunnaMbaDuga vaccunA nIkiTla karmamA |
paramapuruShOttamuni BramatabaDi nIviTla baTTabayalaitigA karmamA ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.