Main Menu

Garudavaahana Dhivya Kaousthubhaalankaara (గరుడవాహన దివ్య కౌస్తుభాలంకార)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. గరుడవాహన | దివ్య – కౌస్తుభాలంకార |
రవికోటితేజ | సా – రంగవదన |
మణిగణాన్విత | హేమ – మకుటాభరణ | చారు
మకరకుండల | లస – న్మందహాస |
కాంచనాంబర | రత్న – కాంచివిభూషిత |
సురవరార్చిత | చంద్ర – సూర్యనయన |
కమలనాభ | ముకుంద | – గంగాధరస్తుత |
రాక్షసాంతక | నాగ – రాజశయన |

తే. పతితపావన | లక్షీశ | – బ్రహ్మజనక |
భక్తవత్సల | సర్వేశ | – పరమపురుష |
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహస్వామీ! గరుడవాహనా! పద్మనేత్రా! దివ్యమైన కౌస్తుభామణి ధరించినవాడా! కోటి సూర్యకిఱణములు వంటి తేజస్సుకలవాడా! ఓ సుందరరూపా!మణులతో మెరయుచున్న బంగారుకిరీటమును ధరించినవాడా! మొసలివలె వ్రేలాడుచుండు అందమైన దివ్యకర్ణాభరణములు కల్గినవాడా! ఓ మందస్మిత ముఖారవిందా! అందమైన చిరునవ్వుతో నొప్పారువాడా! బంగారు వస్త్రమును మేన ధరించినవాడా!రత్నాభరణ భూషిత మొలనూలు ధరించినవాడా! దేవాది శ్రేష్ఠులచే బూజింపబడువాడా!ముకుందా!ఈశ్వరునిచే స్తుతించబడినవాడా!రాక్షససంహారా!నాగరాజ శయనా! పతితపావనుడా! లక్ష్మీవల్లభా! బ్రహ్మజనకుడా! భక్తవత్సలా! ఓ సర్వేశా! శ్రీధర్మపురనివాస! దుష్టసంహారా! మా చెడును పారద్రోలుము తండ్రీ!
.


Poem:
See. Garudavaahana | Divya – Kaustubhaalamkaara |
Ravikotiteja | Saa – Ramgavadana |
Maniganaanvita | Hema – Makutaabharana | Chaaru
Makarakumdala | Lasa – Nmamdahaasa |
Kaamchanaambara | Ratna – Kaamchivibhooshita |
Suravaraarchita | Chamdra – Sooryanayana |
Kamalanaabha | Mukumda | – Gamgaadharastuta |
Raakshasaamtaka | Naaga – Raajasayana |

Te. Patitapaavana | Laksheesa | – Brahmajanaka |
Bhaktavatsala | Sarvesa | – Paramapurusha |
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. garuDavaahana | divya – kaustubhaalaMkaara |
ravikOTitEja | saa – raMgavadana |
maNigaNaanvita | hEma – makuTaabharaNa | chaaru
makarakuMDala | lasa – nmaMdahaasa |
kaaMchanaaMbara | ratna – kaaMchivibhooShita |
suravaraarchita | chaMdra – sooryanayana |
kamalanaabha | mukuMda | – gaMgaadharastuta |
raakShasaaMtaka | naaga – raajaSayana |

tE. patitapaavana | lakSheeSa | – brahmajanaka |
bhaktavatsala | sarvESa | – paramapuruSha |
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.