Main Menu

Gollapudi columns ~ Ashlilapu Swecchha(అశ్లీలపు స్వేచ్ఛ)

Topic: Ashlilapu Swecchha(అశ్లీలపు స్వేచ్ఛ)

Language: Telugu (తెలుగు)

Published on: Aug 20, 2015

Ashlilapu Swecchha(అశ్లీలపు స్వేచ్ఛ)     

18 ఏళ్లు దాటిన ఎవరయినా, ఏ సైటయినా చూడవచ్చునని చట్టం చెప్తూండగా పోర్న్ వీడియోలు చూడటంలో మీ అభ్యంతరం ఏమిటి? మీరు బీజేపీ సభ్యు లట. నిజమేనా? – మరెన్నో మరెన్నో.

ఆ మధ్య కోయంబత్తూరులో పది కాలేజీలలో చదువుకుం టున్న 400 మంది విద్యార్థుల తో ఆరు నెలలపాటు ఒక సర్వే ని నిర్వహించారు. నిర్వహించి నది లండన్‌లో లెక్చరర్‌గా ఉం టున్న అభిషేక్ క్లిఫోర్డ్ అనే వ్యక్తి. ఆయన ‘రెస్క్యూ’ అనే సంస్థకి అధిపతిగా ఉంటు న్నారు. ఒకప్పుడు సంప్రదాయానికి ఆటపట్టుగా ఉన్న కోయంబత్తూరులో 31 శాతం కాలేజీ కుర్రాళ్లు తమ తమ మొబైల్ ఫోన్లు, మిగతా ఎలక్ట్రానిక్ సాధనాల మీద ప్రతిరోజూ అత్యంత దౌర్జన్యకరమైన రేప్‌లూ, అశ్లీలపు వీడియోలు చూస్తున్నారట. ఈ అశ్లీలపు దృశ్యాలు (పోర్న్ చిత్రాలు) చూడటానికి అలవాటు పడిపోయిన వీరు రోజుకి కనీసం 2,700 రేప్‌లను చూస్తున్నారట.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రేప్ వీడియోలు చూసే కుర్రాళ్లలో సగం మంది రేప్‌లు చేయాలనే కోరికను పెంపొందించుకుంటున్నారట. వీరి లో కనీసం 86 శాతం కుర్రాళ్లు – ఈ అశ్లీలపు వీడియో లను చూడటం వల్ల పెళ్లితో ప్రమేయం లేని సెక్స్‌కి కుతూహలాన్నీ, ఉబలాటాన్నీ పెంచుకుంటున్నారు. వీరిలో మళ్లీ 45 శాతం యువతీయువకుల పోర్న్, పసి వారి పోర్న్ చిత్రాలు చూస్తున్నారు.

ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే వీరిలో 18 శాతం పిల్లలు కనీసం నెలకి ఒక్కసారయినా వ్యభి చార గృహాలకు వెళ్తున్నారట. నేర పరిశోధక సంస్థ లెక్కల ప్రకారం ఈ విపరీతపు కోరిక కారణంగా ఒక్క కోయంబత్తూరులోనే 360 మంది హైస్కూలు అమ్మాయి లను దొంగతనంగా ఎత్తుకుపోయారట.

సరిగ్గా 14 రోజుల కిందట చెన్నై దినపత్రికలో మొదటి పేజీలో వచ్చిన వార్తకు కేవలం అనువాదమిది. ఇది ఉత్త భ్రమ అని పెదవి విరిచే స్వేచ్ఛాజీవుల కను విప్పు కోసం ఈ వివరాన్ని కూడా ఉదహరిస్తున్నాను. ఇంకా అనుమానం ఉంటే నా దగ్గర ఆ దినపత్రిక ఉంది.

ఇంకా విచిత్రమైన విషయం ఈ దేశంలో ఈ అశ్లీలపు వీడియోలను చూసే ప్రతీ ముగ్గురిలో ఒకరు స్త్రీ(ట)!

ఈ మధ్య మన దేశంలో 857 అశ్లీలపు వీడియోలు చూపించే సైట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఇంట ర్నెట్ సెక్యూరిటీ చట్టం కింద ఈ బహిష్కరణ జరిగినట్టు పేర్కొంది. మన దేశంలో 4 కోట్ల వెబ్‌సైట్లు ఉంటే ఎక్కు వగా, తరచుగా – వయస్సు, లింగ భేదం లేకుండా విరి విగా చూసే సైట్లు ఈ పోర్న్ వీడియోలట. 2012 డిసెం బర్ రేప్ తర్వాత భయకంపితుడైన ఒక ఇండోర్ లాయ రుగారు కమలేష్ వాస్వానీ అనే ఆయన రేప్ నేరగాళ్లను శిక్షించడమే కాదు, ఈ నేరగాళ్లకు దోహదపడే ఈ దౌర్భా గ్యపు పోర్న్ సైట్లను బహిష్కరించాలని కోర్టుకెక్కారు. ప్రభుత్వం చర్య తీసుకుంది. ఓ కాలేజీ అమ్మాయి పోర్న్ వీడియోలు చూడటం తమ హక్కు అనీ, వాటిని బహి ష్కరించడం వ్యక్తి స్వేచ్ఛను భంగపరచడమేననీ స్పష్టం గా కెమెరా ముందు విన్నవించింది.

ఇప్పుడిక మానవతావాదులు, స్వేచ్ఛాజీవులు రం గంలోకి దూకారు. వారి ప్రశ్నలు: అశ్లీలపు వీడియోలను బహిష్కరించేకంటే స్త్రీల పట్ల సామాజిక ఆలోచనా ధోర ణిలో మార్పు రావడం ముఖ్యం కదా? దేశంలో పోర్న్ సైట్లను బహిష్కరిస్తే రేప్‌లు జరగవంటారా? ఖజురహో వంటి చోట్ల మన పురాతన సాంస్కృతిక వారసత్వంగానే సెక్స్ కనబడుతూండగా పోర్న్‌కు ఎందుకు అభ్యంత రం? 18 ఏళ్లు దాటిన ఎవరయినా, ఏ సైటయినా చూడ వచ్చునని చట్టం చెప్తూండగా పోర్న్ వీడియోలు చూడ టంలో మీ అభ్యంతరం ఏమిటి? మీరు బీజేపీ సభ్యు లట. నిజమేనా? – మరెన్నో మరెన్నో.

వీరందరికీ సవినయంగా నమస్కారం చెయ్యడా నికే ఈ కాలమ్. నిజానికి ఇక్కడితో ఈ చర్చ ముగియవచ్చు.

చట్టం సామాజికమయిన హితవుని దృష్టిలో పెట్టు కుని మనం ఏర్పరచుకున్నది. కొన్ని చర్యల వల్ల మనకు జరిగే అపకారం జరిగాక మనం తెలుసుకున్నది. జరిగే అనర్థం దృష్ట్యా మనకి మనమే నియమాల్ని సవరించు కుంటాం. అశ్లీలపు వీడియోలు చూడటం ద్వారా చిన్న పిల్లలకు జరిగే అనర్థాన్ని కళ్లకు కట్టినట్టు నిరూపించిన నేపథ్యంలో పోర్న్ వీడియోలను చూడటం మన స్వేచ్ఛ అని మైకు ముందు చెప్పే స్థాయిని సాధించిన మన అభి వృద్ధి అత్యంత అభినందనీయం.

జాతి మానసిక ఆరో గ్యాన్నీ, ముఖ్యంగా పసివారి ఆలోచనా ధోరణినీ నియం త్రించే లేదా వక్రీకరించే ఒక ప్రభావాన్ని తమ స్వేచ్ఛగా భావించే పరిణామం, అది రాజకీయం కావడం ఆలో చించవలసిన విషయం అని నాకనిపిస్తుంది. ఒక దుశ్చ ర్య కారణంగా విషం సమాజంలో ప్రబలితే నష్టపోవడా నికి బీజేపీ పిల్లలు, కాంగ్రెసు పిల్లలు, తృణమూల్ పిల్లలు అంటూ వేరే ఉండరు.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.