Main Menu

Gollapudi columns ~ The Last Mughal(ది లాస్ట్ మొఘల్)

Topic: The Last Mughal(ది లాస్ట్ మొఘల్)

Language: Telugu (తెలుగు)

Published on: Feb 19, 2015, Sakshi (సాక్షి) Newspaper

The Last Mughal(ది లాస్ట్ మొఘల్)     

నిర్మాతగా చలవ బట్టలు వేసుకుని కుర్చీలో పెత్తనం చేసే మనస్తత్వం కాదు నాయుడుగారిది. సెట్టు మీద లైట్‌బోయిస్‌తో కలసి ట్రాలీ నడుపుతారు. తోటి సిబ్బందికి ఆ చర్య ఎంత ఊతాన్నిస్తుందో నాకు తెలుసు.

భారతీయ సినీ ప్రపంచంలో మరో రామానాయుడు ఉండరు. ఇది చాలా తేలికగా అని పించే మాటగా చాలామందికి కనిపించవచ్చు కాని- ఆ ప్రత్యే కతని ఒక జీవితకాలం కేవలం పరిశ్రమతో, చిత్తశుద్ధితో నిరూ పించుకున్న వ్యక్తి రామానా యుడుగారు.
సినీమా రంగానికి ఏ మాత్రమూ సంబంధం లేని రైతు కుటుంబంలో పుట్టి, ఎన్నో వృత్తుల్ని చేపట్టారు. ఒక పక్క చదువుకొంటూ ఆసుపత్రి కాంపౌండర్‌గా పని చేశారు. రైసు మిల్లు నడిపారు. ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం చేశారు. చుట్ట, పంచె, లాల్చీతో ఆనాడు మద్రాసుకు కేవలం పొగాకు వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చి, సినీ రంగంలో ముమ్మరాన్ని చూసి- ఓ రోజంతా ఆం ధ్రా క్లబ్బు చెట్టుకింద కూర్చుని ఆ వాతావరణాన్ని పరి కించి, అవగాహన చేసుకుని రంగంలోకి దిగి- సినీరం గంతో ఏ మాత్రం సంబంధం ఉన్న వ్యక్తయినా మరిచి పోలేని శిఖరాలను అధిరోహించిన వ్యక్తి నాయుడుగారు. చదువుతో సంబంధం లేని ఇన్‌స్టింక్ట్ ఆయన పెట్టుబడి. నేలబారు వ్యక్తి ఆర్తి ఆయన మూలధనం. దేశంలో 13 భాషలలో వందల చిత్రాల్ని నిర్మించారు. నాగిరెడ్డి గారి తో కలసి చిత్రాలు తీశారు. విజయం ఆయన ఊతప దం. ఆయన ఓసారి నాతో అన్నారు – ఏనాటికయినా స్టూడియోని నిర్మించాలని. ఒకటికాదు, రెండు స్టూడి యోలు నిర్మించారు.

సురేష్ ప్రొడక్షన్స్‌లో ఎన్నో సినీమాలు నటించాను. కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాణం అన్నింటిలో వ్యక్తిగతమయిన ప్రమేయం పెట్టుకుని-తను చేసేదేదో ఎరిగి చేసిన నిర్మా త-రామానాయుడుగారు. నటుల ఆహార్యం, పాత్రీక రణ – అన్నింటినీ తన ధోరణిలో ఆపో శన పట్టేవారు. ‘మాంగల్యబలం’లో నేను చేసిన ‘బూతుల బసవయ్య’ పాత్ర ఆయనకి అత్యంత ప్రియమైనది. కార ణం- ఆ పాత్ర ఆయనకి తెలుసు. నా దగ్గర కూచుని ఆ పాత్రను నా కళ్లకు కట్టా రు. కారంచేడులో వారి చెల్లెలుగారింట్లో ఉండి ‘శ్రీకట్నలీలలు’ సినీమా చేశాను. ఇన్ని కమర్షియల్ సినీమాలు నిర్మించినా ఆయనకు ఆర్ట్ ఫిలిం తీయాలని సరదా. నా ‘కళ్లు’ కథని బాలచందర్ నిర్మిస్తున్నా రని తెలిసి నన్ను పిలిచి ఆ కథ హక్కులు తీసుకున్నారు. విచిత్రమేమిటంటే ఎన్నో చిత్రాలలో నటించారు. ఆ మధ్య గోవా చలన చిత్రోత్సవంలో నన్ను చూసి, ‘‘ఈ మధ్య నా సినీమాలు ఏం చూసినా నువ్వు కనిపిస్తున్నావయ్యా!’’ అన్నారు.

చాలామందికి తెలియని విషయం- నిర్మాతగా చలవ బట్టలు వేసుకుని కుర్చీలో పెత్తనం చేసే మనస్త త్వం కాదు నాయుడుగారిది. సెట్టు మీద లైట్‌బోయి స్‌తో కలసి ట్రాలీ నడుపుతారు. తోటి సిబ్బందికి ఆ చర్య ఎంత ఊతాన్నిస్తుందో నాకు తెలుసు.
మేము తేలికగా 40 సంవత్సరాలు ఇరుగు పొరుగు ఇళ్లలో మద్రాసులో జీవించాం. కుటుంబాలతో ఆత్మీయ మైన పరిచయం. ఈ మధ్య ఏదో పని మీద ఒక ఉపకా రం కోసం ఆయనకి ఫోన్ చేశాను. ఆ పని పూర్తి చేసి మర్నాడు రోజంతా నా కోసం ఫోన్ చేస్తున్నారు. స్నేహా నికీ, ఆత్మీయతకూ ఆయన ఇచ్చే ప్రాధాన్యం అది.
ఏ షూటింగ్‌లోనో గుర్తులేదు కాని ఓ రోజు ఆల స్యంగా సెట్టు మీదకి వచ్చి ‘‘మా సురేష్ కొడుక్కి నా పేరు పెట్టాడయ్యా!’’ అనడం గుర్తుంది. మనవడిని పరి శ్రమ మళ్లీ ‘రామానాయుడు’ అనలేక ‘రానా’ అంది. రానాతో ‘లీడర్’ చేస్తూ ఈ మాటని గుర్తు చేశాను. సినీ రంగంలో మూడు తరాల వ్యక్తులతో పనిచేసిన అదృష్టం నాది. నాయుడుగారు, వెంకటేష్, రానా. అలాగే కె. ఎస్. ప్రకాశరావుగారు, రాఘవేంద్రరావు, ఇప్పుడు ప్రకాష్. ఒక కళని సంప్రదాయం చేసుకున్న కుటుంబాలివి.

తన వైభవాన్నీ, సంపదనీ తన కుటుంబానికే పరి మితం చేసుకోకుండా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టారు. సామాజిక అభివృద్ధికి డి. రామానాయుడు విజ్ఞానజ్యోతి కేంద్రాన్ని స్థాపించి, మెదక్‌లో ఉదారంగా 33 ఎకరాల స్థలాన్ని ఇచ్చారు. కారంచే డులో, పరిసర ప్రాంతాల్లో ఎన్నో కల్యా ణ మండపాలను నిర్మించారు. సామా జిక చైతన్యానికి అద్దం పట్టే చిత్రం ‘హోప్’ (ఆశ)లో ప్రముఖ పాత్ర ధరిం చారు. కేవలం సామాజిక ప్రయోజనం కారణంగానే ఆ చిత్రానికి జాతీయ బహు మతి లభించింది. అభిరుచికీ, సాటి మనిషి అభ్యుదయానికీ ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చే రామానాయుడుగారు సినీ నిర్మాణంలో గిన్నిస్‌బుక్‌లో ప్రపంచ రికార్డును నెలకొల్పిన ఒకే ఒక్క నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత. పద్మభూషణ్.

ఆయన్ని బాగా, ఆత్మీయంగా తెలిసిన వారికి నాయుడుగారు జీవితాన్ని జీవనయోగ్యం చేసుకున్న మొఘల్. బాగా లోతుకు వెళ్లి చూస్తే మూలాలను మరచి పోని మనిషి. పెదవుల మీద ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే రామానాయుడు గారి జీవితం ఒక సందేశం. మృత్యువు ఒక క్రూరమైన ముగింపు. స్వయంకృషితో తన లక్ష్యాలే పెట్టుబడిగా మానవతా విలువలని రాజీ పరచకుండా విజయానికి మన్నికైన అర్థాన్ని కల్పించిన- మరొక్కసారి- మూవీ మొఘల్ రామానాయుడు.

ఎవరో రచయిత అన్నాడు: జీవితం ఒక ఆక్సిడెంట్. ఎక్కువమంది ఆ ప్రయాణంలో గాయపడుతుంటారు- అని. కానీ జీవితంలో ఎందరి ఆక్సిడెంట్లకో మన్నికైన ప్రత్యామ్నాయాన్ని కల్పించిన వ్యక్తి నాయుడుగారు. ఆయన కన్నీరు-నాకు తెలిసి ఎరుగరు. ఆయన చుట్టూ ఉన్నవారు కూడా-ఆయన కారణంగా కన్నీరు ఎరుగరు.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.