Main Menu

Haridhaasulanu Nindhalaadakundina jaalu (హరిదాసులను నింద లాడకుండిన జాలు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. హరిదాసులను నింద – లాడకుండిన జాలు
సకల గ్రంథమ్ములు – చదివినట్లు
భిక్ష మియ్యంగ ద – ప్పింపకుండిన జాలు
జేముట్టి దానంబు – చేసినట్లు
మించి సజ్జనుల వం – చించకుండిన జాలు
నింపుగా బహుమాన – మిచ్చినట్లు
దేవాగ్రహారముల్ – దీయకుండిన జాలు
గనకకంబపు గుళ్లు – గట్టినట్లు

తే. ఒకరి వర్శాశనము ముంచ – కున్న జాలు
బేరుకీర్తిగ సత్రముల్ – పెట్టినట్లు.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓయీ త్రిగుణాత్మక స్వరూపా!నరసింహా!విష్ణుభక్తులనిందింపకున్న సకల గ్రంథములు అభ్యసించినట్లే.భిక్షము పెట్టునప్పుడు అడ్డుగింపకున్నచో దానము చేసినట్లే.మంచివారిని మోసగించకున్నచో బహుమానాలిచ్చినట్లే. దేవునిమాన్యములకాశపడనిచో బంగారుస్థంబాలతో చేయించిన దేవాలయములు కట్టించినట్లే.ఇతరుల చందాలు దినకున్న చాలు పేరు ప్రతిష్ఠలతో సత్రములు కట్టించినట్లే.కావున విష్ణుభక్తుల నిందించుట, దానము నడ్డగించుట, మంచివారిని మోసము చేయుట, దేవుని సంపదనపహరించుట,ప్రజలనిచ్చిన విరాళములను మ్రింగుట మొదలగు దుష్కార్యములను త్యజించవలెను.
.


Poem:
See. Haridaasulanu Nimda – Laadakumdina Jaalu
Sakala Gramthammulu – Chadivinatlu
Bhiksha Miyyamga Da – Ppimpakumdina Jaalu
Jemutti Daanambu – Chesinatlu
Mimchi Sajjanula Vam – Chimchakumdina Jaalu
Nimpugaa Bahumaana – Michchinatlu
Devaagrahaaramul – Deeyakumdina Jaalu
Ganakakambapu Gullu – Gattinatlu

Te. Okari Varsaasanamu Mumcha – Kunna Jaalu
Berukeertiga Satramul – Pettinatlu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. haridaasulanu niMda – laaDakuMDina jaalu
sakala graMthammulu – chadivinaTlu
bhikSha miyyaMga da – ppiMpakuMDina jaalu
jEmuTTi daanaMbu – chEsinaTlu
miMchi sajjanula vaM – chiMchakuMDina jaalu
niMpugaa bahumaana – michchinaTlu
dEvaagrahaaramul – deeyakuMDina jaalu
ganakakaMbapu guLlu – gaTTinaTlu

tE. okari varSaaSanamu muMcha – kunna jaalu
bErukeertiga satramul – peTTinaTlu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.