Main Menu

I padamekada yila yella (ఈ పాదమేకదా యిల యెల్ల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 66

Copper Sheet No. 10

Pallavi: I padamekada yila yella (ఈ పాదమేకదా యిల యెల్ల)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఈ పాదమేకదా యిల యెల్లగొలిచినది |ఈ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది ||

Charanams

|| ఈ పాదమే కదా యిందరును మ్రొక్కెడిది |యీపాదమే కదా యీ గగన గంగ పుట్టినది |
యీపాదమే కదా యెలమి బొంపొందినది |యీపాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది ||

|| ఈ పదమే కదా యిభరాజు దలచినది |యీపదమే కదా యింద్రాదు లెల్ల వెదకినది |
యీపాదమే కదా యీబ్రహ్మ కడిగినది |యీపాదమే కదా యెగసి బ్రహ్మాండ మంటినది ||

|| ఈ పాదమే కదా యిహపరము లొసగెడిది |యీపాదమే కదా యిల నహల్యకు గోరికైనది |
యీపాదమే కదా యీక్షింప దుర్లభము |యీపాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది ||
.


Pallavi

|| I pAdamEkadA yila yellagolicinadi | I pAdamE kadA yiMdirA hastamula kitavainadi ||

Charanams

|| I pAdamE kadA yiMdarunu mrokkeDidi | yIpAdamE kadA yI gagana gaMga puTTinadi |

yIpAdamE kadA yelami boMpoMdinadi | yIpAdamE kadA yinniTiki nekkuDainadi ||

|| I padamE kadA yiBarAju dalacinadi | yIpadamE kadA yiMdrAdu lella vedakinadi |

yIpAdamE kadA yIbrahma kaDiginadi | yIpAdamE kadA yegasi brahmAMDa maMTinadi ||

|| I pAdamE kadA yihaparamu losageDidi | yIpAdamE kadA yila nahalyaku gOrikainadi |

yIpAdamE kadA yIkShiMpa durlaBamu | yIpAdamE kadA yI vEMkaTAdripai niravainadi ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.