Main Menu

Idi kallayanaradu (ఇది కల్లయనరాదు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 210

Copper Sheet No. 237

Pallavi: Idi kallayanaradu (ఇది కల్లయనరాదు)

Ragam: Dhannasi

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇది కల్లయనరాదు యిది నిశ్చయింపరాదు |
పదిలాన గొలువగా ప్రత్యక్షమయ్యేవు ||

Charanams

|| యెదలో నుండుదువని యివన్ని వేదాలు చెప్పగా |
వెదకి ధ్యానము సేతు వెస గనుగొంటలేదు |
చెదరకందే మరి జీవుడు నున్నాడందురు |
పదిలముగా జూతు భావించరాదు ||

|| అంతటా నుందువని ప్రహ్లాదుడు చెప్పెననగా |
చింతించి పట్టదలతు చేతికి చిక్కుటలేదు |
సంతతజ్ౙానాన నీ సాకార మున్నదందురు |
మంతనాన బిల్తునొకమాట వినబడదు ||

|| రవిలో నుందువని సురలు గొలువగా |
తవిలి పూజించేనంటే దగ్గరి వచ్చుటలేదు |
యివల శ్రీవేంకటాద్రి నిరవై నీ వున్నాడవు |
తివిరి సేవించితిమి ద్రిష్టమాయ మాకు ||

.

Pallavi

|| idi kallayanarAdu yidi niScayiMparAdu |
padilAna goluvagA pratyakShamayyEvu ||

Charanams

|| yedalO nuMDuduvani yivanni vEdAlu ceppagA |
vedaki dhyAnamu sEtu vesa ganugoMTalEdu |
cedarakaMdE mari jIvuDu nunnADaMduru |
padilamugA jUtu BAviMcarAdu ||

|| aMtaTA nuMduvani prahlAduDu ceppenanagA |
ciMtiMci paTTadalatu cEtiki cikkuTalEdu |
saMtataj~jAnAna nI sAkAra munnadaMduru |
maMtanAna biltunokamATa vinabaDadu ||

|| ravilO nuMduvani suralu goluvagA |
tavili pUjiMcEnaMTE daggari vaccuTalEdu |
yivala SrIvEMkaTAdri niravai nI vunnADavu |
tiviri sEviMcitimi driShTamAya mAku ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.