Main Menu

Itara dharmamu lamdu (ఇతర ధర్మము లందు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 399 ; Volume No.1

Copper Sheet No. 83

Pallavi: Itara dharmamu lamdu
(ఇతర ధర్మము లందు)

Ragam: Aahiri

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇతర ధర్మము లందు నిందు గలదా |
మతి దలప పరము నీమతముననే కలిగె ||

Charanams

|| విదురునకు బరలోకవిధి చేసెనట తొల్లి |
అదె ధర్మసుతుడు వర్ణాశ్రమంబులు విడిచి |
కదిసి నీదాసుడైన కతముననేకాదె యీ- |
యెదురనే తుదిపదం బిహముననే కలిగె ||

|| అంటరానిగద్దకుల మంటి జటాయువుకు నీ- |
వంటి పరలోకకృత్యములు సేసితివి మును |
వెంట నీకైంకర్యవిధి కలిమినేకాదె |
వొంటి నీహస్తమున యోగ్యమై నిలిచె ||

|| యిరవైనశబరిరుచు లివియె నైవేద్యమై |
పరగెనట శేషమును బహువిధములనక |
ధర దదీయప్రసాదపు విశేషమేకాదె |
సిరుల శ్రీవేంకటేశ చెల్లుబడులాయె ||

.

Pallavi

|| itara dharmamu laMdu niMdu galadA |
mati dalapa paramu nImatamunanE kalige ||

Charanams

|| vidurunaku baralOkavidhi cEsenaTa tolli |
ade dharmasutuDu varNASramaMbulu viDici |
kadisi nIdAsuDaina katamunanEkAde yI- |
yeduranE tudipadaM bihamunanE kalige ||

|| aMTarAnigaddakula maMTi jaTAyuvuku nI- |
vaMTi paralOkakRutyamulu sEsitivi munu |
veMTa nIkaiMkaryavidhi kaliminEkAde |
voMTi nIhastamuna yOgyamai nilice ||

|| yiravainaSabarirucu liviye naivEdyamai |
paragenaTa SEShamunu bahuvidhamulanaka |
dhara dadIyaprasAdapu viSEShamEkAde |
sirula SrIvEMkaTESa cellubaDulAye ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.