Main Menu

Janaka tanaya nadu (జనక తనయ నాదు)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.

Raagam: Shahana

Arohana :Sa Ri Ga Ma Pa Ma Dhaa Ni Sa
Avarohana :Sa Nee Dha Pa Ma Gaa Ri Ga Ri Sa

Taalam: Caapu

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Janaka Tanaya Nadu | జనక తనయ నాదు     
Album: Unknown | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| జనక తనయ నాదు మనవిగైకొని | జగజ్జనకునితో తెల్పవే ఓ జననీ ||

అనుపల్లవి

|| పనిబూనిలనుబెట్టు బాధలన్నియును | పాటించి మహిలెస్సగా ఓ జననీ ||

చరణములు

|| పండ్రెండేండ్లనుండి పగలురేయి ఆ- | పన్నుడై మిమ్ములను ఓ జననీ |
యెన్నెనో విధముల సన్నుతించినగాని | కన్నుల జూడరు ఓ జననీ ||

|| కన్నీరు లేకుండ నుండుతీరు నాకు | ఎన్నడు లేదుగద ఓ జననీ |
కన్నతండ్రులింత కరుణమాలి భువిని | గాచువారలు గలర ఓ జననీ ||

|| అజుని హరుని ప్రేమ నాశ్రయించి నన్ను | ఆదరించకపోదుర ఓ జననీ |
గజరాజు మకరిచే గాసి జెందివేడ | గాచి రక్షింపలేదా ఓ జననీ ||

|| నిజముగ మీ పాద భజనజేసినవాని | నిర్దయజూచినారు ఓ జననీ |
సుజనాళి మున్ను ఎటువలె బ్రోచిరో | నిజముగాదని తోచెను ఓ జననీ ||

|| అసి పత్రముల పూని ఉగ్రులై నొసలిపై | విసరుచుందు రెప్పుడు ఓ జననీ |
మిస మిసమను కోర్కమీసముల్దువ్వుచు | కసితీర నన్ను దూరిరి ఓ జననీ ||

|| ఆశనిపాతముల నన్నలసట నొందగ | విసరి కొట్టగ ఓ జననీ |
వశముగాదు నిముషమైన నోర్వజాల | జలజాక్షి దిక్కెవ్వరే ఓ జననీ ||

|| గడియ గడియకు నన్ను కదిసి దూతలవలె | కడు భీతి నొందింపగా ఓ జననీ |
ఎడతెగని యాపద ఏ ప్రొద్దు గలిగె నే- | నెవరితో వినిపింతు ఓ జననీ ||

|| తడవేల పైకము తెమ్మని తహశీలి | తాఖీదు సేయింపగా ఓ జననీ |
ఇడుమలబడలేను ఉర్విపై ప్రాణములు | విడిచి మిము జేరుదు ఓ జననీ ||

|| అదిగో వచ్చెదరని ఇదిగో వచ్చెదరని | ఎదురు చూచుచుంటిని ఓ జననీ |
ఒదిగి చిన్నవోయి బందిఖానాలోనే | ఒంటరిగా నుంటిని ఓ జననీ ||

|| సుదతిరో తెల్లవారిన వెనుక నన్నింక | బ్రతుక నియ్యరు భటులు ఓ జననీ |
అతిభీతి నొందితే నర్థించితి నిమిషము | ఆలస్యమిక సేయక ఓ జననీ ||

|| పరమపురుషుడింత యరమరజేసిన | పరుల నెవ్వరి వేడుదు ఓ జననీ |
సరసిజోదరునకు సమ్మతిగాకున్న | సత్కీర్తి దక్కునటే ఓ జననీ ||

|| మరి మరి మిమ్మెప్పుడు మందలించినా | మనసు నీరై పోయెనుగా ఓ జననీ |
సరి నాయిష్టము జెల్లె నేటివరకు నా- | వెరపులన్నియు తీరెగా ఓ జననీ ||

|| అతివరో యన్నదమ్ముల నిటు బంపుమీ | యర్థముతో కూడను ఓ జననీ |
గతి వేరేలేదు సద్గతి నొందుటకును | పతితపావనుండు తప్ప ఓ జననీ ||

|| ఇతర మెరుగక మీరే గతియనినమ్ముచు | యిదివరకున్నాడను ఓ జననీ |
సతతము భద్రాచల రామదాసుని | తరియింప సమయము ఓ జననీ ||

.


Pallavi

|| janaka tanaya nAdu manavigaikoni | jagajjanakunitO telpavE O jananI ||

Anupallavi

|| panibUnilanubeTTu bAdhalanniyunu | pATiMci mahilessagA O jananI ||

Charanams

|| paMDreMDEMDlanuMDi pagalurEyi A | pannuDai mimmulanu O jananI |
yennenO vidhamula sannutiMcinagAni | kannula jUDaru O jananI ||

|| kannIru lEkuMDa nuMDutIru nAku | ennaDu lEdugada O jananI |
kannataMDruliMta karuNamAli Buvini | gAcuvAralu galara O jananI ||

|| ajuni haruni prEma nASrayiMci nannu | AdariMcakapOdura O jananI |
gajarAju makaricE gAsi jeMdivEDa | gAci rakShiMpalEdA O jananI ||

|| nijamuga mI pAda BajanajEsinavAni | nirdayajUcinAru O jananI |
sujanALi munnu eTuvale brOcirO | nijamugAdani tOcenu O jananI ||

|| asi patramula pUni ugrulai nosalipai | visarucuMdu reppuDu O jananI |
misa misamanu kOrxamIsamulduvvucu | kasitIra nannu dUriri O jananI ||

|| ASanipAtamula nannalasaTa noMdaga | visari koTTaga O jananI |
vaSamugAdu nimuShamaina nOrvajAla | jalajAkShi dikkevvarE O jananI ||

|| gaDiya gaDiyaku nannu kadisi dUtalavale | kaDu BIti noMdiMpagA O jananI |
eDategani yApada E proddu galige nE | nevaritO vinipiMtu O jananI ||

|| taDavEla paikamu temmani tahaSIli | tAKIdu sEyiMpagA O jananI |
iDumalabaDalEnu urvipai prANamulu | viDici mimu jErudu O jananI ||

|| adigO vaccedarani idigO vaccedarani | eduru cUcucuMTini O jananI |
odigi cinnavOyi baMdiKAnAlOnE | oMTarigA nuMTini O jananI ||

|| sudatirO tellavArina venuka nanniMka | bratuka niyyaru BaTulu O jananI |
atiBIti noMditE narthiMciti nimiShamu | Alasyamika sEyaka O jananI ||

|| paramapuruShuDiMta yaramarajEsina | parula nevvari vEDudu O jananI |
sarasijOdarunaku sammatigAkunna | satkIrti dakkunaTE O jananI ||

|| mari mari mimmeppuDu maMdaliMcinA | manasu nIrai pOyenugA O jananI |
sari nAyiShTamu jelle nETivaraku nA | verapulanniyu tIregA O jananI ||

|| ativarO yannadammula niTu baMpumI | yarthamutO kUDanu O jananI |
gati vErElEdu sadgati noMduTakunu | patitapAvanuMDu tappa O jananI ||

|| itara merugaka mIrE gatiyaninammucu | yidivarakunnADanu O jananI |
satatamu BadrAcala rAmadAsuni | tariyiMpa samayamu O jananI ||

.

We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.