Main Menu

Jandhe Minpuga Veasisandhyavaarchina Neami (జందె మింపుగ వేసిసంధ్యవార్చిన నేమి)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. జందె మింపుగ వేసి – సంధ్య వార్చిన నేమి
బ్రహ్మ మందక కాడు – బ్రాహ్మణుండు
తిరుమణి శ్రీచూర్ణ – గురురేఖ లిడినను
విష్ణు నొందక కాడు – వైష్ణవుండు
బూదిని నుదుటను – బూసికొనిన నేమి
శంభు నొందక కాడు – శైవజనుడు
కాషాయ వస్త్రాలు – గట్టి కప్పిన నేమి
యాశ పోవక కాడు – యతివరుండు

తే. ఎన్ని లౌకికవేషాలు – గట్టుకొనిన
గురుని జెందక సన్ముక్తి – దొరకబోదు.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ సర్వజగద్రక్షా!జంధెమును సొగసుగ ధరించి సంధ్యవార్చినంత మాత్రమున బ్రహ్మమెఱుగనివాడు బ్రాహ్మణుడు కాడు.తెల్లని నామముల మధ్య ఎర్రని రేఖలుదిద్దిననూ విష్ణువు నెఱుంగని వాడు వైష్ణవుడు కాడు,నుదుట భస్మము ధరించినంతమాత్రమున శివతత్త్వమెఱుంగని వాడు శైవుడు కాదు.కాషాయ రంగు వస్త్రములు ధరించినంత మాత్రాన కోరిక చావని వాడు సన్యాసి కాడు.ఈ లోకములో ఎవరెన్ని వేషములు ధరించిననూ గురువుని గుర్తించని వానికి ముక్తి లభించదు.
.


Poem:
See. Jamde Mimpuga Vesi – Samdhya Vaarchina Nemi
Brahma Mamdaka Kaadu – Braahmanumdu
Tirumani Sreechoorna – Gururekha Lidinanu
Vishnu Nomdaka Kaadu – Vaishnavumdu
Boodini Nudutanu – Boosikonina Nemi
Sambhu Nomdaka Kaadu – Saivajanudu
Kaashaaya Vastraalu – Gatti Kappina Nemi
Yaasa Povaka Kaadu – Yativarumdu

Te. Enni Laukikaveshaalu – Gattukonina
Guruni Jemdaka Sanmukti – Dorakabodu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. jaMde miMpuga vEsi – saMdhya vaarchina nEmi
brahma maMdaka kaaDu – braahmaNuMDu
tirumaNi SreechoorNa – gururEkha liDinanu
viShNu noMdaka kaaDu – vaiShNavuMDu
boodini nuduTanu – boosikonina nEmi
SaMbhu noMdaka kaaDu – SaivajanuDu
kaaShaaya vastraalu – gaTTi kappina nEmi
yaaSa pOvaka kaaDu – yativaruMDu

tE. enni laukikavEShaalu – gaTTukonina
guruni jeMdaka sanmukti – dorakabOdu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.