Main Menu

Jaya Jaya Jaya Priya Bharatha

bharath matha
Pending correction and Content update

Jaya Jaya Jaya Priya Bharatha is a telugu patriotic song composed by Sri Devulapalli Venkata Krishnasastri.

Jaya Jaya Jaya Priya Bharatha     
Source: Gruhinni.com | Voice: Uma Ramana

Lyrics

Song

|| జయ జయ జయ ప్రియభారత ||

Pallavi:
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి ||జయ..జయ

Charanam 1:
జయ జయ సుస్యామల , సుశ్యామ చలచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా ||జయ..జయ

Charanam 2:
జయ దిశాంత గత శకుంత , దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక , గళ విశాల పద విహరణ
జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణ ||జయ..జయ

Meaning

మాకు ప్రియమైన భారతమాతా, దేవభూమీ,
నీకు జయమగు గాక
లక్షలాది స్త్రీపురుషుల హృదయాలకు
కనులవంటి దానా, నీకు జయమగు గాక

శ్యామలవర్ణా, కదలెడు ముదురు ఆకుపచ్చ చెరగు
గల దానా, నీకు జయమగు గాక
వసంతకాలములో విరిసిన పూలను తురిమిన
అందమైన వెండ్రుకలు గల దానా నీకు జయమగు గాక
నా మనసునందలి అభిలాషల ఎర్రని లత్తుకతో
అలంకరించబడిన పాదములు గలదానా నీకు జయము

దీశాంతములకు వెళ్ళిన పక్షుల అమరగానముతో
తృప్తి బొందిన దానా, జయము
గాయకుల, కవుల కంఠములలో వెలువడు
పాటలలో విహరించుదానా, జయము
నా మధురగానముతో ముద్దుపెట్టబాదిన
అందమైన చరణము గల దాన,
(ఇక్కడ పాట చరణము, తల్లి పాదాలు రెంటికి
వర్తిస్తుంది) నీకు జయమగు గాక.

Pallavi:

Jaya jaya jaya priya bharatha janayitri divyadhatri
Jaya jaya jaya satha sahasra nara nari hridaya nethri

Charanam 1:

Jaya jaya sasyamala, susyama chala chelanchala
Jaya vasantha kusuma latha, charitha lalitha choorna kunthala
Jaya madeeya hridayasaya, laaksharuna pada yugala ||Jaya jaya jaya..

Charanam 2:

Jaya disantha gatha sakuntha, divya gana parithoshana
Jaya gaayaka vaithalika,, gala visala patha viharana
Jaya madeeya madhura geya, chumbitha sundara charana ||Jaya jaya jaya..

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.