Main Menu

Kaliyuga vaikumthamu Badrachala (కలియుగ వైకుంఠము భద్రాచల)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Anandabairavi

Arohana :Sa Ga Ri Ga Ma Pa Dha Pa Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Sa

Taalam: Triputa

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Kaliyuga vaikumthamu Badrachala | కలియుగ వైకుంఠము భద్రాచల     
Voice: Unknown.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| కలియుగ వైకుంఠము భద్రాచల నిలయము | సేవింతము సేవింతము ||

అనుపల్లవి

|| అలివేణులారా మీ రానందముగ వేగ | విలసితమైనట్టి వేడుక చూడరె ||

చరణములు

|| కాంచన సౌధముము మానికములు మించిన దూలములు |
వజ్రములు చెక్కించిన స్తంభములు | పగడములని భ్రమియించు ద్వారములు |
అంచయానమది యెంచలేరుగదె | ముంచి పచ్చలు కూర్చిన వాకిళ్ళు ||

|| బంగారు గోపురముల దేవళముల వెలుగు మాణిక్యములు |
భేరి మౄదంగాది నాదములు | భాగవతుల సంకీర్తనములు |
రంగైన కళ్యాణమంటపములు | శౄంగారమేమని చెలియ విన్నవింతు ||

|| తీరైన పురవీధులు సొగసైన కోనేరులు సోపానములు |
సకల ఫలతరువులు పవనములు | నదులు ౠషిగంధర్వ నివాసములు |
సరసిజాక్ష వినవే గోదావరి స్నానము | సంపత్కరమై యొప్పించు ||

|| చక్కని స్త్రీపురుషులు పట్టణమునందు పిక్కటిల్లగ వింతలు |
బ్రాహ్మణులు మక్కువతో పూజలు | వేదశాస్త్రతార్కిక వైష్ణవులు |
గ్రక్కున వారిని కన్నుల జూచిన | ఎక్కువైన పుణ్య మేమని తెలుపుదు ||

|| వామాక్షులాడగను సీతతో హేమపీఠమున సంపూర్ణకళలు |
మోమున వెలుగగ పరివారములు | ప్రేమతో గొలువగను భద్రాద్రి |
రామదాసునేలు స్వామియైన శ్రీ- | కోదండరాము నివాసము ||

.


Pallavi

|| kaliyuga vaikuMThamu BadrAcala nilayamu | sEviMtamu sEviMtamu ||

Anupallavi

|| alivENulArA mI rAnaMdamuga vEga | vilasitamainaTTi vEDuka cUDare ||

Charanams

|| kAMcana saudhamumu mAnikamulu miMcina dUlamulu |
vajramulu cekkiMcina staMBamulu | pagaDamulani BramiyiMcu dvAramulu |
aMcayAnamadi yeMcalErugade | muMci paccalu kUrcina vAkiLLu ||

|| baMgAru gOpuramula dEvaLamula velugu mANikyamulu |
BEri mRudaMgAdi nAdamulu | BAgavatula saMkIrtanamulu |
raMgaina kaLyANamaMTapamulu | SRuMgAramEmani celiya vinnaviMtu ||

|| tIraina puravIdhulu sogasaina kOnErulu sOpAnamulu |
sakala Palataruvulu pavanamulu | nadulu RuShigaMdharva nivAsamulu |
sarasijAkSha vinavE gOdAvari snAnamu | saMpatkaramai yoppiMcu ||

|| cakkani strIpuruShulu paTTaNamunaMdu pikkaTillaga viMtalu |
brAhmaNulu makkuvatO pUjalu | vEdaSAstratArkika vaiShNavulu |
grakkuna vArini kannula jUcina | ekkuvaina puNya mEmani telupudu ||

|| vAmAkShulADaganu sItatO hEmapIThamuna saMpUrNakaLalu |
mOmuna velugaga parivAramulu | prEmatO goluvaganu BadrAdri |
rAmadAsunElu svAmiyaina SrI- | kOdaMDarAmu nivAsamu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.