Main Menu

Karthayugmamuna Neekathalu Sokinajaalu (కర్ణయుగ్మమున నీకథలు సోకినజాలు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. కర్ణయుగ్మమున నీ – కథలు సోకినజాలు
పెద్ద పోగుల జోళ్లు – పెట్టినట్లు
చేతు లెత్తుచు బూజ – సేయగల్గినజాలు
తోరంపు కడియాలు – దొడిగినట్లు
మొనసి మస్తకముతో – మ్రొక్క గల్గినజాలు
చెలువమైన తురాయి – చెక్కినట్లు
గళము నొవ్వగ నిన్ను – బలుక గల్గినజాలు
వింతగా గంఠీలు – వేసినట్లు

తే. పూని నిను గొల్చుటే సర్వ – భూషణంబు
లితర భూషణముల నిచ్చ – గింపనేల.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహా!నీ మహిమాన్వితమైన భక్తుల కథలు వింటేచాలు మా చెవులకు పోగులు ధరించినట్లే.చేతులెత్తి పూజసేయగల్గితే జాలు మా చేతులకు కడియాలు తొడిగినట్లే.భక్తితో శిరస్సువంచి పూజించిన చాలు అందమైన తురాయి చెక్కినట్లే.గొంతు నొప్పి పెట్టునట్లు నిన్ను స్తుతించిన చాలు నీకు ఘనమైన కంఠమాలలు వేసినట్లే.నిన్ను భక్తితో పుజించుటే నీ కర్పించు సకల భూషణములు.ఇంక యితర ఆభరణములెందుకు స్వామీ!
.


Poem:
See. Karnayugmamuna Nee – Kathalu Sokinajaalu
Pedda Pogula Jollu – Pettinatlu
Chetu Lettuchu Booja – Seyagalginajaalu
Torampu Kadiyaalu – Dodiginatlu
Monasi Mastakamuto – Mrokka Galginajaalu
Cheluvamaina Turaayi – Chekkinatlu
Galamu Novvaga Ninnu – Baluka Galginajaalu
Vimtagaa Gamtheelu – Vesinatlu

Te. Pooni Ninu Golchute Sarva – Bhooshanambu
Litara Bhooshanamula Nichcha – Gimpanela.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. karNayugmamuna nee – kathalu sOkinajaalu
pedda pOgula jOLlu – peTTinaTlu
chEtu lettuchu booja – sEyagalginajaalu
tOraMpu kaDiyaalu – doDiginaTlu
monasi mastakamutO – mrokka galginajaalu
cheluvamaina turaayi – chekkinaTlu
gaLamu novvaga ninnu – baluka galginajaalu
viMtagaa gaMTheelu – vEsinaTlu

tE. pooni ninu golchuTE sarva – bhooShaNaMbu
litara bhooShaNamula nichcha – giMpanEla.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.