పద్యం:
సీ. కూర్మావతారమై – కుధరంబుక్రిందను
గోర్కితో నుండవా – కొమరు మిగుల?
వరహావతారమై – వనభూములను జొచ్చి
శిక్షింపవా హిర – ణ్యాక్షు నపుడు?
నరసింహమూర్తివై – నరభోజను హిరణ్య
కశిపుని ద్రుంపవా – కాంతి మీఱ?
వామనరూపమై – వసుధలో బలిచక్ర
వర్తి నఱంపవా – వైర ముడిగి?
తే. యిట్టి పను లెల్ల జేయగా – నెవరికేని
తగునె నరసింహ | నీకిది – దగును గాక |
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |
తాత్పర్యం:
ఓ నరసింహా!కూర్మావతారములో మందరగిరి క్రింద మిక్కిలి సొగసుగా ప్రకాశించినావు.పందిరూపములో హిరణ్యాక్షుని సంహరించినావు.నరసింహమూర్తివై భీకరాసుడైన హిరణ్యకశిపుని వధించినావు.వామనరూపములో శత్రుత్వముతో బలిచక్రవర్తిని అణగద్రొక్కితివి.యింతటి మహోత్కృత్యములను నెరవేర్ప నీకే దగునుగాని వేరెవ్వరి శక్యమో పరమేశ్వరా!
.
Poem:
See. Koormaavataaramai – Kudharambukrimdanu
Gorkito Numdavaa – Komaru Migula?
Varahaavataaramai – Vanabhoomulanu Jochchi
Sikshimpavaa Hira – Nyaakshu Napudu?
Narasimhamoortivai – Narabhojanu Hiranya
Kasipuni Drumpavaa – Kaamti Meerxa?
Vaamanaroopamai – Vasudhalo Balichakra
Varti Narxampavaa – Vaira Mudigi?
Te. Yitti Panu Lella Jeyagaa – Nevarikeni
Tagune Narasimha | Neekidi – Dagunu Gaaka |
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |
.
see. koormaavataaramai – kudharaMbukriMdanu
gOrkitO nuMDavaa – komaru migula?
varahaavataaramai – vanabhoomulanu jochchi
SikShiMpavaa hira – NyaakShu napuDu?
narasiMhamoortivai – narabhOjanu hiraNya
kaSipuni druMpavaa – kaaMti meerxa?
vaamanaroopamai – vasudhalO balichakra
varti narxaMpavaa – vaira muDigi?
tE. yiTTi panu lella jEyagaa – nevarikEni
tagune narasiMha | neekidi – dagunu gaaka |
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |
.
No comments yet.