Main Menu

Kotha Duppati – Thammudi Utharam | కొత్త దుప్పటి – తమ్ముడి ఉత్తరం

Sannapu Reddy Venkata Rami Reddy was born on 16th February 1963 in Balarajupalle(v), Kadapa(dt).More…

Bathuku Seadyam: A book comprising 30 short stories of villages in their own native slang.
Published Date:
Distributed by: Vishal Andhra Publications
Infobox
200×200

ఎండన పడి ఇంటికొచ్చేచేసరికి ఒళ్ళంతా సెగలు పొగలైంది చేన్నారెడ్డి. దొడ్లొకి పోఈ చన్నీళ్లు మొహాన చల్లుకొని కుతురు అందించిన చెంబెడు మంచినీళ్ళు తాగి వచ్చి ఫ్యాను కింద కుర్చీలో కూలబడితేగాని ఎండ తాపం తగ్గలేదు,
“అన్నం తెచ్చేనా నాన్నా?” శ్రావణి అడిగింది.
కడుపునిండా నీళ్ళు తొణికిసలాడుతున్నాయ్. చెమటలు కక్కుతూ ఫ్యాను గాలికి ఆవిరవుతున్నాయి.
అన్నం సహించేట్టు లేదు. అలవాటు జొద్దీ అడిగాడు “ఏం కూరమ్మా?” అని.
“పపు…. ”
వెగటుగా చుశాడు.
“వంకాయ పప్పులే… తిను”
“ఆవడి గాలులు గదమ్మా! వంకాయ పప్పులే… తిను”
“ఆవడి గాలులు గదమ్మా! వంకాయ చేదెక్కి వుంటాదేమో నే!
“చింత చివురు పెట్టి ఎనిపినాలే…”
మనస్సు లేచి వచ్చింది ఆయనకు.
చింతచివురు చిరుపుల్లదనం జిహ్వను కదిలించింది.
వంకాయలోని చ్చేదును విరిచి పప్పుకు కమ్మని రుచినిచ్చే చివురు మాట కడుపులో ఆకలి రగిలింది.
అప్పటికే అన్నం పళ్లేం తన ముందుకు వచ్చి వుంది.
వేడివేడి అన్నానికి పప్పు కలిపి ఇష్టంగా తింటోంటే చెమటలు గుబగుబ పొంగు కొస్తున్నాయి.
ఫ్యాను గాలి హాయిగా ఉంది.
“అన్న ఫోన్ జేసిండు నాన్నా!”
“ఏమంట?”
“ఫంక్షన్ గ్రాండ్‌గా చెయ్యాలంట..”
అన్నం కలిపి పిడచ నోటబెట్టుకొని దాన్ని నమిలి మింగేదాకా నోరెత్తలేదు ఆయన.
“వాళ్ళు ఫ్రండ్స్ కూడా వస్తారంట..”
తలెత్తి కూతురి కేసి చూశాడు.
“ఈ హంగామా అంతా అవసరమంటావా?” అన్నాడు. “రిటైర్మెంట్ అనేది ప్రతి ఉద్యోగి జీవితంలో సాధారణం రా! మా ఉపాధ్యాయూ తరపున ఎటూ సన్మానముంటుంది గదా!”
“శాలువా కప్పి టీ నీల్లిచ్చి పంపుతదా?” దొడ్డి వాకిట్లోంచి అంది జానకమ్మ.
“మన చేతినుంచి పదివేలు ఖర్చుపెట్టి తప్పెట్లు మేళాలతో వూరేగుతే మాత్రం ఏమొస్తదే?” భార్య కేసి చూశాడు.
“నీ పీనాసి బుద్ధి పోనిచ్చుకొన్నేవు గాదు…” వెంటనే అంది జానకమ్మ.
“జోజప్ప మాయిన తెంపులేకుంటే ఎట్లా?… పొయ్యేకడ మాత్రం కట్టలుకట్టలు లెక్క పోగొడ్తావు. ఇదో ఇట్లాంటప్పుడు గట్టిగా పట్టుకొంటవు…” చేతులు తిప్పుతూ దెప్పింది.
ఆమె ఎత్తిపొడుపులోని ‘పోగొట్టుకొనే తావూ అర్థమై మరేమి మాట్లాడలేదు చెన్నారెడ్డి.
భోజనం పూర్తిచేయి తుడుచుకొంటూ పంచలోకి నడుస్తూంటే శ్రావణి చెప్పింది వెనకనుంచి “జాబొచ్చింది నాన్నా!” అని .
“యానుంచిమ్మా?”
“పల్లెనించి… చిన్నాన్న రాసిండు…”
“ఏమంట?”
“కొత్తగా ఏముంటదీ?” సాగదీసింది జానకమ్మ. “అన్నకాడ దుడ్లు కుప్పబోసిండాయి గదా!
గడ్డిదినో కంపదినో తమ్ముని కోసమే కూడేసింటాడు గదా!”
“అమ్మా!” కూతురు అతురు అడుకోబోయింది.
జానకమ్మ నోరు మూతబడేందుకు మరికొంత సమయం పట్టింది.
ఉస్సురుమంటూ పంచలోని మంచమ్మీద వాలాడు చెన్నారెడ్డి.
ఫ్యాన్ స్విచ్ వేసి తలకిందికి దిండు తెచ్చింది శ్రావణి.
జాబు తెచ్చి టేబుల్ మీద వుంచింది.
ఇన్‌లాండ్ కవర్ అది.
ఇంకా చించి కూడా చూడ్లేదు.
చూసేందుకేముంది?
జానకి అన్నట్లు ఒకటే సమాచారం. కరవు కాటుకు మందుకోసం చేతులు చాచే దృశ్యం.
చినుకు రాల్చని గగనం… పాతాళానికి చేరిన జలం… బీళ్ళూగా మారిన పొలం…
కన్నీళ్ల పాలయిన రైతు జీవితం…
చాలసేపు ఆలోచిస్తూ వుండిపోయాడు.
కనురెప్పలు మూతపడినా ఆలోచనలు ఆగిపోలేదు.
నిద్రలో కూడా అవే.. అలలు అలలుగా…
నాలుగ్గంటల ప్రాంతంలో మెలకువ వచ్చింది. లేచి ఇంట్లోకి పోబోతోంటే టేబుల్ మీద లెటర్.
దాన్నెవరూ యింకా చించలేదు.
లోపలి విషయమంతా అక్షరం పొల్లుబోకుండా అందరూ వూహించేయగలుగుతున్నారు.
దొడ్లోకెళ్లి మొహం కడుక్కొన్నాడు.
వంటింట్లో కొద్దిసేపు నిల్చున్నా స్టౌ ముందున్న జానీకి తలతిప్పి చూడలెదు.
ఆమె వైఖరిలో మార్పొచ్చింది.
పల్లెనించి జాబొచ్చిందంటే చాలు ఆమెలో యీ మార్పు సహజమే. రుసరుసలు..
విసవిసలు… మూతి విరుపులు.. ఎత్తిపొడుపులు…
పంచలోకి వెళ్లేసరికి శ్రావణి కాఫీ గ్లాసుతో వచ్చింది.
కాఫీ అందుకొని ఈజీ చైర్‌లో వాలాడు.
తను మేలోనే రిటైరయ్యాడు.
జూన్‌లో పాఠశాలలు తెరిచిన తొలినాళ్ళలోనే తనకు సన్మానం చేయబోతున్నారు.
సుదీర్ఘమైన ఉపధ్యాయ వృత్తి.
పొలన్ని వదిలి బడిలోకి అడుగేసి… తిరిగి ఉపాధ్యాయునిగా బళ్లను వెదుక్కొంటూ
ఎన్నెన్ని కొత్త ప్రాంతాల్లోనో పాదాలు మోపుతూ… తను అడుగు పెట్టినమేరా ప్రతి
బదినీ సారవంతమైన పొలంగా మారుస్తూ… ప్రతి విద్యార్థినీ చీడపీడలు అంటని మొక్కలా
తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తూ… సాదరంగా చూసిన వూరుని, సాగుచేయాల్సిన పొలాన్నీ,
సాకవలసిన అమ్మాన్నాన్నల్నీ తమ్మునికి వదిలేసి….
అమ్మానాన్నలు అదృష్టవంతులు. రైతుల్ని ఆత్మహత్యల దిశగా తీసికెళ్లే వ్యవసాయ్యాన్ని
కళ్ల చూడకుండానే వెళ్లిపోయారు.
తను కూడా అదృష్టవంతుడే – వ్యవసాయానికి దూరం కావడం, పసిపిల్లల మొహాల్లో
పచ్చని మొక్కల్ని కలగంటోన్నందుకు నెలపంట తీసికొంటూ సుఖంగా బతకడం….
తమ్మునికి వ్యవసాయం మీద అంతలావు వ్యామోహం పుట్టాల్సింది కాదు. అదంతా
నాన్న చలవే.
తనను బడికి పంపాడు.. వాడ్ని పొలం బడికి తీసుకెళ్ళాడు.
కష్టపడి చదివి తను ప్రభుత్వ ఉద్యోగి అయితే –
వాడు కూడా కష్టపడి మంచి సేద్యగాడు అయ్యాడు.
అదను పదను తెలిసి పైరుపెట్టడం, చీడపీడల్ని ముందే పసిగట్టడం, పంటను
నిలువ చేసికోవడం, తూకాల్లో మోసాలు తెలుసుకోవడం… మంచి సేద్యగాడే అయ్యాడు.
అంతేనా!… మంచి విత్తనకాడయ్యాడు . మంచి వామేటుగాడయ్యాడు . మంచి
మోకులగాడయ్యాడు.. మంచి అల్లకంగాడయ్యాడు.. అన్నీ కలగలిసి మంచి
సేద్యగాడయ్యాడు…
వాస్తవానికి జీతగానిగా పిలవబడాల్సిన తను నెలపంట తీస్తున్నాడు కాబట్టి ‘సార్’గా
గౌరవింపబడే గవర్నమెంటు ఎంప్లాయి అయ్యాడు.
ఏడాది పంటగ్గూడా గతిలేదు గాబట్టి వాడు సేద్దే’గాడు’య్యాడు.
వాడి నైపుణ్యమంతా ‘గాడు’ కిందికే పోయింది.
లేచి యింట్లోకెళ్ళి చొక్కా తగిలించుకొన్నడు.
టేబుల్ మీది జాబుతీసి జేబులో పెట్టుకొన్నడు.
చించాలనిపించలేదు. చదవాలనిపించలేదు. ప్రస్తుతానికి దాన్ని చించి చదివేంత
ధైర్యం కూడా లేదు.
బైటకెళ్లేందుకు సిద్ధమవుతూ చెప్పుల్లో కాళ్లు దూర్చబోయి ఏదో గుర్తొచ్చిన వాడిలా
బీరువా వద్దకు నడిచాడు.
బట్టల షాపులో కొంత బాకీ ఉంది. ఈ రోజన్నా చెల్లేయాలి.
భీరువా తెరచి డబ్బు అందుకోబోతూ ఎందుకో అనుమానం వచ్చి దొడ్డి వాకిటికేసి
చూశాడు.
తనుహించినట్లు ఇటే చూస్తోంది జానకి.
నొసలు మూడేసి చూపులకు పదను కూడా పెట్టింది.
తన్ను శల్యపరీక్ష – తను తీసుకోబోయే డబ్బూలకూ పల్లెనుంచి వచ్చిన జాబుకూ లంకెవేసే అనుమానం నిండిన చూపుల్ని గుచ్చుతూ…
చచ్చేంత సిగ్గుగా అనిపించి టక్కున చేయి వెనక్కి తీసుకొన్నాడు.
డబ్బు అందుకోకుండానే డోర్ వేసి బైటక్కదిలాడు.
తన పరిస్థితి తనకే జాలిగొలిపేలా ఉంది.
ఆమెచూపులు తన్నింకా వెంటాడుతున్నట్లే ఫీలింగ్.
ఆమె దృష్టీలో తనంత మరుగుజ్జుగా మారాడు మరి!
కరువు పడేసి పిండినపుడల్లా గిలగిల్లాడుతూ వాడు జాబు రాయటం… తను డబ్బు పంపడం…
జాబొచ్చిందంటే చాలు నెలరోజులపాటు దాని సెగల పొగలు ఐల్లిడిచీ పొయ్యేది లేదు.
తొలుదొల్త వాడు ఇంటికే వస్తుండేవాడు.
జానకి గొడవ పెట్టుకోవడం, దుబారాగా మాట్లాడడంతో ఇటుకేసి రావడం చాలించాడు.
“చెన్నారెడ్డన్నా…!”
ఆలొచనల్నించి తెరుకొని పిలుపు వినవచ్చిన దిశకు చూశకు చూశాడు.
తనప్పుడే కాలేజీ సెంటరుకు వచ్చి ఉన్నాడు.
టీకొట్టు ముందునించి పిలుస్తున్నాడు యూనియన్ నాయకుడు రాఘవ.
చెన్నారెడ్డికి కూడా టీ ఆఫర్ చేశారు.
“డేట్ ఫిక్సయిందట గదా! రేపు బుధవారమేనా?”
‘అవు ‘ నన్నట్టుగా తలూపాడు చెన్నారెడ్డి.
“ఫంక్షన్‌కు జిల్లా నాయకులు కూడా వస్తాన్నారన్నా! ఉపన్యాసాలు అదిరిపోతాయి.
ఎట్ల జేస్తావో మరి… దానికి తగినట్టే మెయిటెయిన్ చెయ్యాల్. మొన్న ప్రభాకర్ రిటైర్మెంట్‌లో వాళ్ల యూనియన్ బాగా చప్పిడి చేసింది. మనం చప్పుళ్ళు చేయొద్దు.
సత్తా చూపించాల..” చెప్పాడు రాఘవ.
“ఏన్ని పొటేళ్ళు సార్?” పక్కనే ఉన్న పీటర్ అడిగాడు.
కొంత తటపటాయించాడు చెన్నారేడ్డి. తర్వాత చెప్పాడు “అంతా టిసి సుక్రటరికి అప్పగించినా సార్!” అని.
“మస్తాన్ భాయ్ గదా! గ్రాండ్‌గానే ఉంటాదిలే… నువ్వేం ఖర్చుకు వెనకాదొద్దు…” రాఘవ మాటలకు మెల్లగా తలూపాడు.
ప్రభుత్వం నుంచి రావలసిన ఆర్థిక బకాయిల్ని రాబట్టుకొనేందుకు వీళ్ళు సహాయం అవసరం.
కొంతసెపు యూనియన్ విషయాలూ.. ఫక్షన్ సంగతులూ..
సిగరెట్ కొనుకొనుక్కునేందుకు చిల్లరకోసం జేబులో చేయిపెడుతోంటే మునివేళ్లకు కాగితం స్ప్రర్ష సోకి, అది జాబుగా అర్థమై….
ఫంక్షన్‌కు బంధుమిత్రులందర్నీ పిల్చుకోవాలి.
ముఖ్యంగా తమ్మునికి చెప్పి పంపాలి. పల్లె జనాన్నంతా పిలవాలి. ఇట్లాటి కార్యక్రమాల్ని చిత్తుశుద్ధితో నెత్తినేసుకు చేసేదీ, మనస్పూర్తిగా ఆస్వాదించేదీ వాళ్ళే.వీళ్ల సంరంభమంతా
చూస్తోంటే ఖర్చు పదిహేను వేలకు దాటేట్టుంది. బ్యాండ్ మేళం, వీడియో, ఫోటోలు, షామియానాలు, కుర్చీలు, విందు వినోదాలు, వూరెగింపూ..
ఓ చిన్న కుటుంబంలో పెళ్ళి ఖర్చంత.
విచిత్రంగా – యీ ఖర్చును తన భార్య కోరుకుంటోంది. ఎంటెక్ చేసే కొడుకు అభిల్షషిస్తున్నాడు.
ఈ ఖర్చంతా తల్చుకొంటే తమ్ముని జాబు గుర్తొస్తోంది. వ్యవసాయం
పెట్టుబడులకోసం ఎగజూస్తూ చేతులు చాచే అందులోని అక్షరాలు గుర్తొస్తున్నాయి.
ఇంకో పదివేలు అదనంగా ఖర్చు పెట్టినా కుటుంబ సభ్యులు సంతోశంగా వొప్పుకునేట్టున్నారు గాని జాబును గురించి మాత్రం సమ్మతించేటు లేరు. టి.సి. సెక్రటరీ మస్తాన్ సార్ కనిపించాడు.
ఫంక్షన్ ఏర్పాట్ల గురించి చర్చించాడు.
ఇన్వటేషన్స్ ప్రింటేయించాలి. పంచాలి. ఆహ్వానించాలి.
తన దృష్టిలో ఇదంతా ‘తెచ్చిపెట్టుకొన్న బరువుగా’ తోస్తోంది చెన్నారెడ్డికి.
“మీ సొంతూరు ఏవూరు సార్?” ఓ కుర్ర టీచర్ అడిగాడు. పల్లెపేరు చుప్పాడు.
“అదృష్టవంతులు సార్ మీరు. స్వంత గడ్డమీద రిటైరవుతాండరు” అన్నాడు.
ఆకుర్రటీచర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చాడుట. ఏదో కుగ్రామం నుంచి.
చెన్నారెడ్డి కుటుంబ విషయాలు అడిగాడు – అచ్చూ పల్లెటూరివాడిలాగే.
పంచరత్నాలు రాసుకొస్తాడట ఫంక్షన్‌కు.
తన్నేదో ఆలోచనల్లోకి తీసుకెళ్ళాయి అతని మాటలు. తన బాల్యం… గుడిలోపురాణం… యవ్వన ప్రాయంలో ఛందస్సు తెలిసినప్పుడు పద్యాలు అల్లిన జ్ఞాపకాలూ…
“మీ తమ్ముడు కూడఇక్కడే జాబ్ చేస్తున్నాడా సార్?”
పరధ్యానంగా “ఆ…” అన్నాడు.
అంటే.. ఆయన కూడా ఇక్కడే రిటైర్ అవుతాడన్నమాట.అదృష్టమంటే మీదే సార్!”
జరిగిన పొరపాటేదో అర్థమైంది చెన్నారెడ్డికి.
“లేదు లేదు.. మా తమ్ముడు ఎంప్లాయి కాదు… ఇంటికాడ వ్యవసాయం…” సవరించాడు.
పొలాల గురించీ, వ్యవసాయాన్ని గురించి ఆ యువ ఉపాధ్యాయుని ప్రశ్నల పరంపర….
అతని ప్రతి ప్రశ్న తన తమ్ముని గురించి అడుగు తున్నట్లే ఉంది. జేబులో ఉత్తరాన్ని గుర్తు చేస్తున్నట్లే వుంది.
టిసి సెక్రటరీతో కలిసి వీడియోగ్రాఫర్ వద్దకెళ్లి మాట్లాడాడు. బట్టలషాపు, షామీయానాలు,
వంట పాత్రలు వగైరాలన్నీ విచారిస్తూ బజరంతా తిరిగేసరికి చాలా సమయమైంది.
ఎవరితో మాట్లాడుతున్నా. ఏ పని చేస్తున్నా మనసు లోలోపల ఏదో సన్నని అలజడి.
తనకు తెలీకుండానే పల్చని పదరు. అదేమిటో అన్వేషించి పసిగట్టి పట్టుకుంటే.. అది తమ్ముని జాబు గురించిన ఆందోళనగా అర్థ మై..
ఏం చేయగలడు తను?
భార్యా పిల్లలకు ఇష్టం లేకుండా ఇన్నేళ్ళూ సహాయం చేసి కూడా తమ్ముడ్ని ఉధ్దరిగించకపోయాడు.
తమ వాట సగం పొలం అమ్ముకొని సొమ్ము చేసుకొందామంటుంది భార్య.
ప్రతి తొలకరింపులకూ పొలం పెట్టుబడికి డబ్బులిచ్చి అతన్ని చెరుస్తున్నావంటాడు కొడుకు. ఆ డబ్బుతో చిన్నపాటి వ్యాపారం పెట్టించి వున్నాన్న ఎప్పుడో బాగుపడేవాడని వాడి వాదన.
కూతురు కూడా అన్న మాటకే వంతపలుకుతుంది.
ఎంట్లో తనొక్కడే ఏకాకి అవుతున్నాడు – ఈవిషయంలో .
తనకే గదా పొలంతో, పొలం పనితో సద్దన్నంతో, కష్టాలతో, కన్నీళ్లతో ప్రత్యక్ష సంబంధం వుండేది!
తరం కిందిటే వ్యవసాయం వదిలి టౌన్ జేరిన ప్రభుత్వోద్యోగి కుతుంబం నుంచి వచ్చింది భార్య.
పిల్లకు కోడా తల్లి అనుభవమే.
తనెట్లా పొలం కలల్ని వదులుకోగలడు?
వదులుకోకుండా తను చెసింది కోడా ఏదీ లేదు.
నిరిటి కరువు కన్నీళ్లను మిగిల్చింది.
ఇప్పుడు మళ్లీ కొత్త పెట్టుబడులకోసం జాబు రాసినట్టున్నాడు.
కుటుంబ సభ్యలు యింత గట్టిగా వ్యతిరేకిస్తోంటే వాళ్ళను కాదని తను డబ్బు అందించగలడా?
గతంలోల తను పొర్రటం చేయగలడా?
తనిప్పుడు రిటైర్ అయ్యాడు
తనకొచ్చే పెన్షన్ కుటుంబాన్ని గట్టేక్కిస్తే చాలు.
కర్నూలు ఉపాధ్యాయుని మాటలు గుర్తొచ్చాయి.
తమ్ముడు కూడా తన పనినుంచి రిటైరవడం మంచిదెమో!
తన్ ఆలోచన తనకే నవ్వు తెప్పించింది.
రైతు తన పనినుంచి రిటైరయ్యేదెప్పుడు? పాడెమీదకెక్కినప్పుదే గడా!
ఈ మధ్యకాలంలో రాష్ర్టంలో చాలామంది రైతులు ముందస్తు రిటైర్మెంటు ప్రకటించుకొంటున్నారు – పురుగు మందుల సాయంతోనో, కరెంటు తీగల
సహాయంతోనో, ఉరితాళ్ళ సాన్నిహిత్యంతోనో.
తను సహాయం చేయకుంటే తమ్ముడు కూడా ఆ దారిలోనే నడవక తప్పదేమో!
గుండెల్లో సన్నని పదరు మొదలైంది చెన్నారెడ్డికి.
కొడుకన్నట్లు వాడు వ్వవసాయం చాలించుకొంటే ఉత్తమం గదా!
వ్యాపారం చేసుకొంటే నాలుగువేళ్ళు నోట్లోకి పోతాయి గదా!
ఆలోచిస్తూ ఇంటిదారి పట్టాడు చెన్నారెడ్డి.
వీధిలైట్ల వెలుతురు కింద మెల్లిగా నడుస్తున్నాడు.
ఏమాత్రం బతుకుదెరువు కనిపించుకున్నా తమ్ముడు ఎందుకట్లా వ్యవసాయాన్నే పట్టుకు వేలాడున్నాడో అర్థం కాలేదు అతనికి. వాడి కాళ్ళు పట్టుకొని అప్పుజేసి
ఎందుకట్లా మట్టిలో చల్లుతున్నాడో! రెక్కలు ముక్కలు చేసుకొని వాడు పొలాన్ని ఎందుకు సాకుతున్నాడో…?
అవును.. వాడు పొలాన్ని సాకుతున్నాడు. సందేహం లేదు. వాడి పొలమే కాదు తన పాలిటి పొలాన్ని కూడా సాకుతున్నాడు.
పైసా ఆదాయం రాకున్నా బాధ్యతగాపోషిస్తున్నాడు. ఇరుగుపొరుగులు గెట్లు దున్ని ఆక్రమించుకోకుండా, పొలం కోతబడకుండా,కంపచెట్టు మొలిచి బరకగా మారకుండా, సత్తువ కోల్పోయి పాందవ బీడు కాకుండా…
పన్ను చెల్లిస్తూ మరీ సాకుతున్నాడు… తను వదిలేసి వచ్చిన ముసలి అమ్మానాన్నల్ని సాకినట్లు పొలాన్ని సాకుతున్నాడు. ఏ ప్రయోజనాన్ని ఆశించి అమ్మానాన్నల్ని సాకాడో అదే ప్రయోజనాన్ని ఆశించి కళ్లాల్నీ,
కంపల్నీ, చెట్లనీ, ఇంటినీ, బర్రెల్నీ,కోళ్లను… ఆ సెంటిమెంట్‌తోనే, ఆ బంధాలతోనే, ఆ అనుబంధాలతోనే…
తల్లిదండ్రుల్ని సాకటంలో తనూ సగం బాధ్యతల్ని విహించాలి. అలాగే పొలం విషయంలో కూడా.
తనింతవరకు తమ్మునికి డబ్బందిచటం తన విద్యుక్తధర్మంలో ఒక భాగమేననే స్పృహ వచ్చేసరికి మనస్సు తేలికయ్యింది చెన్నారెడ్డికి.
ఈ వాదన వింటే భార్య పిల్లలు నవ్వుతారు కాబోలు. తనకింత జీవితాన్నిచ్చిన పొలాన్ని కన్నవాళ్లతో పోల్చినా కూడా జానకి దాన్ని అమ్మాలనే అంటుంది బహూశా…
ఫంక్షన్‌కు తను తప్పకుండా తమ్ముడ్ని పిలవాలి.
విత్తనాలకూ, ఎరువులకయినా సర్దుబాటు చేయాలి.
ఈ ఏడాది కాకకుంటే వచ్చే ఏడదయినా వర్షం రాకపోదు. పంటలు పండకపోవు.
ఒక వేళ వానలే కురవకపోతే వాడు మాత్రం వూరు వదిలి రాక తప్పదు కదా!
అప్పుడే ఏదైనా వ్యాపారం పెట్టిద్దామనుకున్నాడు.
ఇంటికెళ్లి బట్టలు మార్చుకొని కేవలం పంచెమీద ఈజీచైర్‌లో వాలాడు.
మనస్సంతా తమ్ముని జాబుమీదే ఉంది.
తనింకా జాబు చించి చూడలేదనే విషయం గుర్తొచ్చింది.
జాబులోని విషయాన్ని భార్యా కూతురితో బాటు తను కూడా కేవలం వూహించటంతోనే ఇంత కథ అల్లుతున్నారు.
“శ్రావణీ!జాబిట్లా తీసుకురామ్మా!” చెప్పాడు. “చొక్కాజేబిలో ఉంది చూడు.” జాబు పట్టుకొచ్చింది శ్రావణి.
కళ్లద్దాలు తెమ్మని చెప్పబోయి, ఇంట్లోకి తొంగి చూసి బాత్రూంలో నీళ్లచప్పుడు పసిగట్టి, “స్నానంచేస్తాంది గదూ మీ అమ్మ!” అన్నాడు.
“ఆ …”
“అయితే జాబు చదువు…”
జాబు చించి చదవడం ప్రారంభించింది ఆమె.
మొదట కొన్ని మాటలు షరా మామూలే. కరవులు.. అప్పులు…
సంతకు తోలే పశువులూ.. నిలువెండిపోతోన్న చెట్లు…
తమ చింత వనంలో కూడా అక్కడక్కడా కొమ్మలు ఎండుతున్నాయిట.
వానల్లేకుంటే వచ్చే ఏడాదికి నిలువెండటం ఖాయమట.
“అందుకే చింతతోపును అమ్మినా…”
ఉలిక్కిపడ్డట్టుగా కూతురికేసి ఎగజూశాడు చెన్నారెడ్డి.
ఒకక్షణం గుండెలు లబలబలాడాయి అతనికి.
నమ్మలేనట్లుగా చూశాడు.
ఆ వాక్యాన్ని మరోసారి చదివింది ఆమె.
నిజమే… అమ్మేశాడు… పురాతనమైన చింత వనం. తమ పూర్వీకులెప్పుడో నాటి పోషించి పెద్దవి చేసిన చింతచెట్లను అమ్మేశాడు.
ఆమె ఉత్తరం చదవుతూ ఉంది.
చింత వనాన్ని ఎవరు కొన్నది, ఎప్పుడు నరుక్కుపోయేది, డబ్బు ఎప్పుడు చేతికందేది…
చింతచెట్లతో కలిసి పంచుకొన్న తన బాల్యపు అనుబంధమంతా కళ్లముందు గిర్రున తిరిగింది చెన్నారెడ్డికి.
పొలంత ఆత్మీయ బంధాలున్నాయి చింతవనంతో.
తొలకరింపుల్లో కేవలం రెమ్మలు తడిసేట్టుగా నాలుగు చినుకులు చిలకరించిపోతే చాలు -మూడవ రోజుకే చెట్టంతా బుడిపెలు బుడిపెలుగా చివుళ్లు పొడుచుకొస్తాయి.
కుచ్చెళ్లు గోచిపోసి కొమ్మకో ఆడమనిషి సన్నని పాటగా మారి చివుళ్లు దూస్తూ.. ఎక్కన్నించో వచ్చి వాలిన వింత పక్షుల్లా… అద్భత దృశ్యం అది…
చింతకాయలు పండినప్పుడూ, తొలి వానలకు తడిసి రాలినప్పుడూ… తెల్లారకముందే
చెట్లకింద కోడిపిల్లల్లా వెంపర్లాడే బాల్యం.
“అన్నా! లెక్క అందగానే నీ వాటా వచ్చే పాతికవేల రూపాయలూ నీకు తెచ్చిస్తా…
ఇట్లు… అనేక నమస్కారములతో… నీ తమ్ముడు”
ఉలికిపాటుగా కూతిరికేసి చూశాడు.
జానకి ఇంకా బాత్రూంలోంచి బైట పడినట్టు లేదు.
‘అమ్మయ్యా అంటూ గుండెల్నిండా వూపిరి పీల్చుకున్నాడు.
“జాబు ఇటీమ్మా!” చేయి చాచాడు.
అందివ్వగానే మరో ఆలోచన లేకుండా నెమ్మదిగా చించి ముక్కలు చేశాడు.
“శ్రావణీ! యీ విషయం మీ అమ్మకు చెప్పొద్దురా!” అన్నాడు ప్రాధేయపడుతున్న ట్లుగా.
తండ్రికేసి ఆశ్చర్యంగా చూసింది ఆమె.
అయోమయంగా చూసింది.
జాబు చించిన విషయమో, అర్ధం కాలేదు.
“చింత వనం అమ్మినారనీ, యాభైవేల లెక్కొస్తాదనీ, మన వాటా పాతికవేలనీ..
యీ సంగతి మీ యమ్మకు తెలిస్తే గొడవ చేస్తది. లెక్క తీసుకురమ్మంటది.మనిషినయినా పంపించి తెప్పించుకుంటది. పాత బాకిలోకి
చెల్లేయమంటూ చిన్నాయనవాటా పాతికవేలు కూడా రాబట్టుద్ది…” ఆగి గుండెల నిండా వూపిరి పీల్చుకున్నాడు. “చిన్నాన్న సంగతి తెలుసు గదరా! అప్పుల్లో కూరకపోయుండాడు. కరువు మీద కరువొచ్చి పడతావుంటే
వూపిరాడక గిలగిల కొట్టుకొంటండాడు. అప్పులోల్లు ఇంటీమీదకి పోతా వుండారు. మీ అమ్మమాటిని మనమా లెక్క దీసుకున్నేమనుకో… వాడేమైపోతాడో… వాని పెండ్లాం పిల్లోల్లు ఏమైపోతారో..” ఆయన గొంతు జీరబోయింది.
“నన్ను బడికి పంపి వాన్ని పొలానికి పంపిండురా మీ అబ్బ వాడు పొలం పనిచేసిందాన్నే నేను చదువుకోగలిగినా. వాని రెక్కల కష్టంతోనే నేను ఉద్యోగస్తున్నెయినా… వాని పున్నేన్నే మీ అమ్మకు – మంచంలో పన్నె మా అమ్మానాయనోల్లను సగదీడే బరువు తప్పింది…” ఆయన మాటల్లో తడి వూరుతూ ఉంది.
“మా యన్న యింత సదువు సదివినాడనీ, తెలివిగల్లోడనీ, మాయన్న టీచరైనాడనీ, మాయన్న కొడుకు ఎంటెక్ సదువుతుండాడనీ… ఎంత ఆనందంగా సెప్పుకొంటాడంట
తల్లీ వాడు…! వాడు… నాకు తమ్ముడు గాదురా… మా నాయన… ఇప్పుడా లెక్క మనం దెచ్చుకొంటే వాడు పురుగుమందు తాగి సస్తాడమ్మా!”… దుఖావేశంతో గొంతు పూడుకుపోయింది.
భుజం మీది టవల్‌తో మొహాన్ని దాచుకొని కన్నీళ్లు వొత్తుకున్నాడు.
శ్రావణికి కూడా గుండె కదిలింది.
కొంతసేపు ఇద్దరిమధ్యా మౌనం రాజ్యమేలింది.
“అబ్బాకూతుళ్లు తెగ యవ్వారం జేస్తాండరే! టివీలో మీ సీరియల్ వస్తాంది. అన్నం తింటా సూస్తారా? చూసింతర్వాత తింటారా?” జానకమ్మ అడిగింది వాకిట్లోంచి.
ముందుగా శ్రావణి యింట్లోకెళ్లింది.
సీరీయల్ మొదలైంది కాబట్టి అన్నం వడ్డించలేదు.
కళ్లు టి.వి. మీదున్నాయి గాని మనస్సెక్కడో వుంది చెన్నారెడ్డికి. రోజూ యీ ఒక్క సీరియల్ చూస్తాడు అన్నం తింటూ.
సిరియల్ చూస్తాడు అన్నం తింటూ.
సీరియల్ అయిపోయి అన్నం పళ్లెం తనముందు కొచ్చేదాకా ఆలోచిస్తూనే వుండిపోయాడు.
“ఫంక్షన్‌కు మీ పల్లెలోని లేబరోళ్లందర్నీ పిలుస్తావేమో! మనల్ని కూడా వాల్లల్లో ఒకరుగా జమకడ్తారు…” చెప్పింది జానకమ్మ.
అన్నం ముద్ద నోట్లో పెట్టుకోబోతూ తల పైకెత్తాడు ఆతడు.
అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నాడు.
“ఆ ఇన్విటేషన్స్ సంగతేందో నువ్వే చూసుకో. నేనా వూరికి పోను. ఎవ్వుర్నీ పిలువను..”
ఎవ్వుర్నీ అనే పదాన్ని నొక్కి పలికాడు.
శ్రావణికి ఆశ్చర్యంగా ఉంది.
తండ్రి పరిస్థితి పట్ల జాలిగా వుంది.
భోజనం తర్వాత తల్లి మరో సీరియల్ మాయాలోకంలో విహరించే సమయాన
ఇంటి బైట ఈజీ చైర్‌లో వాలి వున్న తండ్రివద్డకు వెళ్లింది.
“నాన్నా… చిన్నాన్న…”
ఆమె సందేహం అర్థమైంది చెన్నారెడ్డికి.
“వాడు రాకపోవడమే మంచిదిలేరా!” చెప్పాడు.
“మీ చిన్నాయన సంగతి నీకు తెల్దామ్మా! మన వాటా లెక్క మనం తీసుకోలేదని
దానితో వాడేదయినా వస్తువు కొని ప్రజంటేషన్ చేసినా చేయగలడు.. మనం తెలిసీ వానికా అవకాశం ఇవ్వకూడదని నేనే నిర్ణయించుకొన్నా…
తండ్రికేసి తదేకంగా చూస్తూ ఇంట్లోకెళ్ళింది ఆమె.
‘వానికా అవకాశం యివ్వకూడదు…’ మరోసారి మనస్సులో దృఢంగా మననం చేసుకొన్నాడు.
‘కరువు చేసిన గాయాన్ని మానుపుకొనేందుకు ఆ కొద్దిపాటి సొమ్మును వాన్ని లేపనంగా రాసుకోనీ.’
ఆలోచిస్తూ వుంటే అతనికి ఓ విషయం ఆశ్చర్యాన్ని కలిగించింది.
చెట్లతో, గుట్టలతో, చేలతో, కళ్లాలతో అంతటి గాఢమైన అనుబంధాన్ని పెంచుకొన్నాడు. యిప్పుడెట్లా చింతతోపు నరికించి అమ్మాడు?
చింత తోపు మీద మర్లు తెంచుకొన్నవాడు పొలం మీద మాత్రం తుంచుకోకుండా ఉండగలడా ?
వడిలో ఏదో కొత్త మార్పు చోటు చేసుకొంటోంది.
ఆర్థిక ఇబ్బందులు వాడిలోని సుదీర్ఘమైన అనుబంధాల్ని విరిచేస్తున్నట్లున్నాయి.
పొలమ్మీదా, చెట్లమీదా, చెట్లమీదా, పల్లెదనం మీదా పెంచుకొన్న గాడానుంధాల్ని
తెంచుతోన్న చిటపటల శభ్దా లేవో చెవులకు అస్పష్టంగా వినిపిస్తున్నాయి.
జీవితకాలపు వ్యామోహాల్నీ, మరుల్నీ తుంచుకొనే యీ సంధిదశలొ పాపం!
వాడెంత మానసిక వేదనకు గురవుతున్నాడో!
దాన్ని తనకు అన్వయించుకొని అనుభూతికి తెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తూ కళ్లు మూసుకొన్నాడు చెన్నారెడ్డి.
సీరియల్ మధ్య ప్రకటనల సమయంలో బైటకొచ్చింది శ్రావణి.
ఈజీ చైర్‌లో నిద్రిస్తున్నాడు తండ్రి.
ఆమెకేదో అనుమానం వచ్చి దగ్గరగా వెళ్లి చూసే సరికి – రెండు కళ్ళు రెండు కన్నీటి కాల్వలుగా…
తుడుచుకొనేందుక్కూడా స్పృహ తెలీని వేదనామయ అనుభూతిలో…
ఈజీ చేర్ పక్కనే ఒంగుని కండువాతో ఆయన కళ్లు అద్దసాగింది ఆమె.
ఉన్నట్టుండి తండ్రి స్తానంలో చిన్నాన్న రూపం కనిపించి ఉలిక్కిపడి తదేకంగా చోడసాగింది.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.