Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 84
Volume No. 5
Copper Sheet No. 14
Pallavi: Lamjakadavauduvu (లంజకాడవౌదువు)
Ragam: Ahiri
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
లంజకాడవౌదువు నీ లాగులెల్ల గానవచ్చె
ముంజేత బెట్టిన సొమ్ములకద్దనేలరా
చరణములు
1.కొంకక యెవ్వతో కాని కోరి నీ బుజము మీద
కంకణాల చేయి వేసి కౌగిలించా బోలును
వంకలైన వొత్తులెల్ల వడి గానవచ్చె నింక
బొంక నేమిటికిరా నీ బూమెలెల్ల గంటిమి
2.ఒద్దిక నెవ్వతో గాని వోరి నీవురము మీద
నిద్దిరించ గంటమాల నీలములొత్తినది
తిద్దిన జాణవుగాన తిరిగి తిరిగి మాతో
బద్దనేటికిరా నే బచ్చినేయ జాలను
3.వేడుక నెవ్వతో తిరువేంకటేశ్వర నిన్ను
కూడిన నీమేనితావి కొల్ల పట్టుకొన్నది
తోడనె నాకౌగిటిలో దొరకొంటి వింక నిన్ను-
నాడ నేమిటికిరా నాయలపెల్ల దీరెను
.
Pallavi
lamjakADavauduvu nI lAgulella gAnavacce
mumjEta beTTina sommulakaddanElarA
Charanams
1.komkaka yevvatO kAni kOri nI bujamu mIda
kamkaNAla cEyi vEsi kaugilimcA bOlunu
vamkalaina vottulella vaDi gAnavacce nimka
bomka nEmiTikirA nI bUmelella gamTimi
2.oddika nevvatO gAni vOri nIvuramu mIda
niddirimca gamTamAla nIlamulottinadi
tiddina jANavugAna tirigi tirigi mAtO
baddanETikirA nE baccinEya jAlanu
No comments yet.