Main Menu

Maanyambuleeya Samarthudokkadu Leadu (మాన్యంబులీయ సమర్ధుడొక్కడు లేడు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. మాన్యంబులీయ స – మర్ధుడొక్కడు లేడు
మాన్యముల్ చెఱుప స – మర్ధు లంత
యెండిన యూళ్లగో – డెఱిగింప డెవ్వడు
బండిన యూళ్లము – బ్రభువు లంత
యితడు పేద యటంచు – నెఱిగింప డెవ్వండు
కలవారి సిరు లెన్న – గలరు చాల
దనయాలి చేష్టల – తప్పెన్న డెవ్వడు
బెఱకాంత ఱంకెన్న – బెద్ద లంత

తే. యిట్టి దుష్టుల కధికార – మిచ్చినట్టి
ప్రభువు తప్పు లటంచును – బలుకవలెను.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహా!నేడు ఈనాభూమిలీయ సమర్థుడొక్కడు లేడుగాని,వాటిని చెఱచు సమర్థులంతటనున్నారు. పండని ఊళ్ళను పట్టించుకోగాని పండే భూములకు అందరూ ప్రభువులే. పేదలను పట్టించుకోరుకాని ధనవంతుల ఐశ్వర్యాభివృద్దికి పాటుపడుదురు.భార్య చేయు తప్పులనెన్నడుగాని పొరుగింటి ఆడుదాని తప్పులు ఎన్నుటకు అందరూ పెద్దలే.ఇట్టి దుష్టుల కధికారమిచ్చినచో పరిపాలకునిదే తప్పు.
.


Poem:
See. Maanyambuleeya Sa – Mardhudokkadu Ledu
Maanyamul Cherxupa Sa – Mardhu Lamta
Yemdina Yoollago – Derxigimpa Devvadu
Bamdina Yoollamu – Brabhuvu Lamta
Yitadu Peda Yatamchu – Nerxigimpa Devvamdu
Kalavaari Siru Lenna – Galaru Chaala
Danayaali Cheshtala – Tappenna Devvadu
Berxakaamta Rxamkenna – Bedda Lamta

Te. Yitti Dushtula Kadhikaara – Michchinatti
Prabhuvu Tappu Latamchunu – Balukavalenu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. maanyaMbuleeya sa – mardhuDokkaDu lEDu
maanyamul cherxupa sa – mardhu laMta
yeMDina yooLlagO – DerxigiMpa DevvaDu
baMDina yooLlamu – brabhuvu laMta
yitaDu pEda yaTaMchu – nerxigiMpa DevvaMDu
kalavaari siru lenna – galaru chaala
danayaali chEShTala – tappenna DevvaDu
berxakaaMta rxaMkenna – bedda laMta

tE. yiTTi duShTula kadhikaara – michchinaTTi
prabhuvu tappu laTaMchunu – balukavalenu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.