Main Menu

Nammiti jummi (నమ్మితి జుమ్మీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 487

Copper Sheet No. 384

Pallavi: Nammiti jummi (నమ్మితి జుమ్మీ)

Ragam: Deva gandhari

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| నమ్మితి జుమ్మీ వో మనసా నాకే హితవై మెలంగుమీ |
ముమ్మాటికి నేజెప్పితి జుమ్మీ మురహరు నామమే జపించుమీ ||

Charanams

|| తలచకుమీ యితర ధర్మములు తత్త్వజ్ౙానము మర్కవకుమీ |
కలగకుమీ యేపనికైనను కడు శాంతంబున నుండుమీ |
వలవకుమీ వనితల కెప్పుడు వైరాగ్యంబున నుండుమీ |
కొలువకుమీ యితర దైవముల గోవిందునినే భజించుమీ ||

|| కోరకుమీ దేహ భోగములు గొనకొని తపమే చేకొనుమీ |
మీరకుమీ గురువుల యానతి మెర్కయ బురాణములే వినుమీ |
చేరకుమీ దుర్జన సంగతి జితేంద్రియుడవై నిలువుమీ |
దూరకుమీ కర్మఫలంబును ధ్రువవరదునినే నుతించుమీ ||

|| వెర్కవకుమీ పుట్టుగులకు మరి వివేకించి ధీరుడవగుమీ |
మర్కువకుమీ యలమేలమంగకు మగడగు శ్రీ వేంకటపతిని |
కెర్కలకుమీ మాయారతులను కేవల సాత్వికుడవు గమ్మీ |
తొర్కవకుమీ నేరములకు సింధు రక్షకునినె సేవించుమీ ||
.


Pallavi

|| nammiti jummI vO manasA nAkE hitavai melaMgumI |
mummATiki nEjeppiti jummI muraharu nAmamE japiMcumI ||

Charanams

|| talacakumI yitara dharmamulu tattvaj~jAnamu marxavakumI |
kalagakumI yEpanikainanu kaDu SAMtaMbuna nuMDumI |
valavakumI vanitala keppuDu vairAgyaMbuna nuMDumI |
koluvakumI yitara daivamula gOviMduninE BajiMcumI ||

|| kOrakumI dEha BOgamulu gonakoni tapamE cEkonumI |
mIrakumI guruvula yAnati merxaya burANamulE vinumI |
cErakumI durjana saMgati jitEMdriyuDavai niluvumI |
dUrakumI karmaPalaMbunu dhruvavaraduninE nutiMcumI ||

|| verxavakumI puTTugulaku mari vivEkiMci dhIruDavagumI |
marxuvakumI yalamElamaMgaku magaDagu SrI vEMkaTapatini |
kerxalakumI mAyAratulanu kEvala sAtvikuDavu gammI |
torxavakumI nEramulaku siMdhu rakShakunine sEviMcumI ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.