Main Menu

Narasimha Naa Thandrinanneelu Nannelu (నరసింహ నా తండ్రినన్నేలు నన్నేలు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. నరసింహ | నా తండ్రి – నన్నేలు నన్నేలు
కామితార్థము లిచ్చి – కావు కావు
దైత్యసంహార | చాల – దయయుంచు దయయుంచు
దీనపోషక | నీవె – దిక్కు దిక్కు
రత్నభూషితవక్ష | – రక్షించు రక్షించు
భువనరక్షక | నన్ను – బ్రోవు బ్రోవు
మారకోటిసురూప | – మన్నించు మన్నించు
పద్మలోచన | చేయి – పట్టు పట్టు

తే. సురవినుత | నేను నీచాటు – జొచ్చినాను
నా మొఱాలించి కడతేర్చు – నాగశయన |
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరశింహా! నాతండ్రీ! నన్నేలుకొమ్ము.నా కోరికలను తీర్చి కావుము తండ్రీ! ఓ రాక్షస సంహారీ!నా పై దయజూడుము. ఓ దీనపోషక!నీవే నాకు దిక్కు రత్నాభరణ భూషిత వక్షస్థలముగలవాడా! నన్ను రక్షింపుము. లోకరక్షకా! నన్ను కాపాడుము తండ్రీ!అగణిత సౌందర్యమూర్తి! ఓ నవమన్మథాకారా! నన్ను మన్నించుము.ఓ పద్మలోచనుడా! నీ చేయినాకందించి సాయపడుము. సురవినుత! నీచాటున చొచ్చినాను.నా మొరాలించినన్ను కరుణించవా కనకభూషణ భుజంగశయనా!

.


Poem:
See. Narasimha | Naa Tamdri – Nannelu Nannelu
Kaamitaarthamu Lichchi – Kaavu Kaavu
Daityasamhaara | Chaala – Dayayumchu Dayayumchu
Deenaposhaka | Neeve – Dikku Dikku
Ratnabhooshitavaksha | – Rakshimchu Rakshimchu
Bhuvanarakshaka | Nannu – Brovu Brovu
Maarakotisuroopa | – Mannimchu Mannimchu
Padmalochana | Cheyi – Pattu Pattu

Te. Suravinuta | Nenu Neechaatu – Jochchinaanu
Naa Morxaalimchi Kadaterchu – Naagasayana |
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. narasiMha | naa taMDri – nannElu nannElu
kaamitaarthamu lichchi – kaavu kaavu
daityasaMhaara | chaala – dayayuMchu dayayuMchu
deenapOShaka | neeve – dikku dikku
ratnabhooShitavakSha | – rakShiMchu rakShiMchu
bhuvanarakShaka | nannu – brOvu brOvu
maarakOTisuroopa | – manniMchu manniMchu
padmalOchana | chEyi – paTTu paTTu

tE. suravinuta | nEnu neechaaTu – jochchinaanu
naa morxaaliMchi kaDatErchu – naagaSayana |
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.