Main Menu

Narasimha Nea Ninnunamminandhuku Jaala (నరసింహ నే నిన్నునమ్మినందుకు జాల)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. నరసింహ | నే నిన్ను – నమ్మినందుకు జాల
నెనరు నాయందుంచు – నెమ్మనమున
నన్ని వస్తువులు ని – న్నడిగి వేసటపుట్టె
నింకనైన గటాక్ష – మియ్యవయ్య
సంతసంబున నన్ను – స్వర్గమందే యుంచు
భూమియందే యుంచు – భోగశయన |
నయముగా వైకుంఠ – నగరమందే యుంచు
నరకమందే యుంచు – నళిననాభ |

తే. ఎచట నన్నుంచిననుగాని – యెపుడు నిన్ను
మఱచి పోకుండ నీనామ – స్మరణనొసగు.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహా!నిన్ను మనస్పూర్తిగా నమ్మినందుకు నా పై దయవుంచుము.కోరికలెన్నో కోరి నెరవేరక అలసిపోతిని.ఇకనైనా నా పై దయతో వరములనొసగుము తండ్రీ!ఓ భుజగశయనా!నన్ను స్వర్గము నందుగాని, భూమిపైగాని సంతోషముగా నుంచుము. లేక నీ చెంతనే వైకుంఠపురమందైన ఆశ్రయము కల్పింపుము.చివరకు నన్ను నరకమందుంచిననూ బాధపడను. కాని ఓ నళిననాభ! నన్నెక్కడనుంచినను నిన్ను మరువకుండునట్లు చేయుము తండ్రీ!
.


Poem:
See. Narasimha | Ne Ninnu – Namminamduku Jaala
Nenaru Naayamdumchu – Nemmanamuna
Nanni Vastuvulu Ni – Nnadigi Vesataputte
Nimkanaina Gataaksha – Miyyavayya
Samtasambuna Nannu – Svargamamde Yumchu
Bhoomiyamde Yumchu – Bhogasayana |
Nayamugaa Vaikumtha – Nagaramamde Yumchu
Narakamamde Yumchu – Nalinanaabha |

Te. Echata Nannumchinanugaani – Yepudu Ninnu
Marxachi Pokumda Neenaama – Smarananosagu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. narasiMha | nE ninnu – namminaMduku jaala
nenaru naayaMduMchu – nemmanamuna
nanni vastuvulu ni – nnaDigi vEsaTapuTTe
niMkanaina gaTaakSha – miyyavayya
saMtasaMbuna nannu – svargamaMdE yuMchu
bhoomiyaMdE yuMchu – bhOgaSayana |
nayamugaa vaikuMTha – nagaramaMdE yuMchu
narakamaMdE yuMchu – naLinanaabha |

tE. echaTa nannuMchinanugaani – yepuDu ninnu
marxachi pOkuMDa neenaama – smaraNanosagu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.