Main Menu

Nigamaadhisaasthamul Nearpina Dhvajudaina (నిగమాదిశాస్త్రముల్ నేర్చిన ద్విజుడైన)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. నిగమాదిశాస్త్రముల్ – నేర్చిన ద్విజుడైన
యఙ్ఞకర్తగు సోమ – యాజియైన
ధరణిలోపల బ్రభా – త స్నానపరుడైన
నిత్యసత్కర్మాది – నిరతుడైన
నుపవాస నియమంబు – లొందు సజ్జనుడైన
గావివస్త్రముగట్టు – ఘనుడునైన
దండిషోడశమహా – దానపరుండైన
సకల యాత్రలు సల్పు – సరసుడైన

తే. గర్వమున గష్టపడి నిన్ను – గానకున్న
మోక్షసామ్రాజ్య మొందడు – మోహనాంగ |
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ భూషణావికాస!నరసింహా!వేదశాస్త్రాదివిద్యలు నేర్చిన బ్రాహ్మణుడైననూ,యజ్ఞకర్త అయిన చేసే సోమయాజి అయిననూ,ధరణిపై ఉదయస్నానము నాచరించువాడనైననూ.ఉపవాసవ్రతమాచరించువాడనైనూ,కాషాయమును ధరించు గొప్ప సన్యాసియైననూ,పదునాఱుమహాదానములు చేయుదానపరుండైననూ,సకల పుణ్యక్షేత్రములు దర్శించిన సద్గుణోపాసనుడైననూ గర్వముతో నిన్ను చూడకున్న నీ మోక్షసమ్రాజ్యమును జేరలేడు సుమా! ఓ మోహనాంగ! అట్లు శ్రద్దాభక్తులతో కొలవనినాడు నిష్ప్రయోజకుడని యర్థము.
.


Poem:
See. Nigamaadisaastramul – Nerchina Dvijudaina
Yagnyakartagu Soma – Yaajiyaina
Dharanilopala Brabhaa – Ta Snaanaparudaina
Nityasatkarmaadi – Niratudaina
Nupavaasa Niyamambu – Lomdu Sajjanudaina
Gaavivastramugattu – Ghanudunaina
Damdishodasamahaa – Daanaparumdaina
Sakala Yaatralu Salpu – Sarasudaina

Te. Garvamuna Gashtapadi Ninnu – Gaanakunna
Mokshasaamraajya Momdadu – Mohanaamga |
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. nigamaadiSaastramul – nErchina dvijuDaina
yagnyakartagu sOma – yaajiyaina
dharaNilOpala brabhaa – ta snaanaparuDaina
nityasatkarmaadi – niratuDaina
nupavaasa niyamaMbu – loMdu sajjanuDaina
gaavivastramugaTTu – ghanuDunaina
daMDiShODaSamahaa – daanaparuMDaina
sakala yaatralu salpu – sarasuDaina

tE. garvamuna gaShTapaDi ninnu – gaanakunna
mOkShasaamraajya moMdaDu – mOhanaaMga |
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.