Main Menu

Nigamagoochara Neenuneeku Moppagunattu (నిగమగోచర నేనునీకు మెప్పగునట్లు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. నిగమగోచర | నేను – నీకు మెప్పగునట్లు
లెస్సగా బూజింప – లేను సుమ్మి
నాకు దోచిన భూష – ణములు పెట్టెద నన్న
గౌస్తుభమణి నీకు – గలదు ముందె
భక్ష్యభోజ్యముల న – ర్పణము జేసెద నన్న
నీవు పెట్టితి సుధ – నిర్జరులకు
గలిమికొద్దిగ గాను – కల నొసంగెద నన్న
భార్గవీదేవి నీ – భార్య యయ్యె

తే. నన్ని గలవాడ వఖిల లో – కాధిపతివి |
నీకు సొమ్ములు పెట్ట నే – నెంతవాడ |
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నిగమగోచర!నీ మెప్పుపొందునట్లు లెస్సగా పుజించలేను.నాకున్నంతలో నీకు ఆభరణములు పెట్టెదమన్న నీ వక్షస్థలమందు కౌస్తుభమణి కలదు. భక్ష్యభోజ్యములు నీ కర్పించుదామన్న దేవతలకు ముందే నీవు అమృత మొసంగితివి. నాకు కల్గిన ఐశ్వర్యము నీకిచ్చెదమన్న లక్ష్మీదేవియే నీకు భార్యయైనది.అఖిలలోకాధిపతివి! అన్నియునూ గలవాడవు. నీకు భూషణాదుల నర్పింప నేనెంతవాడను తండ్రి.(అనగా అల్పుడనని భావము).
.


Poem:
See. Nigamagochara | Nenu – Neeku Meppagunatlu
Lessagaa Boojimpa – Lenu Summi
Naaku Dochina Bhoosha – Namulu Petteda Nanna
Gaustubhamani Neeku – Galadu Mumde
Bhakshyabhojyamula Na – Rpanamu Jeseda Nanna
Neevu Pettiti Sudha – Nirjarulaku
Galimikoddiga Gaanu – Kala Nosamgeda Nanna
Bhaargaveedevi Nee – Bhaarya Yayye

Te. Nanni Galavaada Vakhila Lo – Kaadhipativi |
Neeku Sommulu Petta Ne – Nemtavaada |
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. nigamagOchara | nEnu – neeku meppagunaTlu
lessagaa boojiMpa – lEnu summi
naaku dOchina bhooSha – Namulu peTTeda nanna
gaustubhamaNi neeku – galadu muMde
bhakShyabhOjyamula na – rpaNamu jEseda nanna
neevu peTTiti sudha – nirjarulaku
galimikoddiga gaanu – kala nosaMgeda nanna
bhaargaveedEvi nee – bhaarya yayye

tE. nanni galavaaDa vakhila lO – kaadhipativi |
neeku sommulu peTTa nE – neMtavaaDa |
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.