Main Menu

Nityulu muktulu (నిత్యులు ముక్తులు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 414 ; Volume No. 1

Copper Sheet No. 85

Pallavi: Nityulu muktulu (నిత్యులు ముక్తులు)

Ragam: Malavi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| నిత్యులు ముక్తులు నిర్మలచిత్తులు నిగమాంతవిదులు వైష్ణవులు|
సత్యము వీరల శరణనిబ్రదుకరో సాటికి బెనగక జడులాల ||

Charanams

|| సకలోపాయశూన్యులు సమ్యగ్జ్ఞానులు |
అకలంకులు శంఖచక్రలాంఛనులన్నిట బూజ్యులు వైష్ణవులు |
వొకటీ గోరరు వొరుల గొలువరు వొల్లరు బ్రహ్మాదిపట్టములు |
అకటా వీరలసరియన భపంబారుమతంబుల పూతతోకలన్ ||

|| మంత్రాంతరసాధానాంతరంబులు మానినపుణ్యులు విరక్తులు |
యంత్రపుమాయల బొరలుపరులకు యెంతైనా మొక్కరు వైష్ణవులు |
తంత్రపుకామక్రోధవిదూరులు తమనిజధర్మము వదలరు |
జంత్రపుసంసారులతో వీరల సరియని యెంచగ బాపమయ్య ||

|| తప్పరు తమపట్టినవ్రత మెప్పుడు దైవమొక్కడే గతియనుచు |
వొప్పగుతమపాతివ్రత్యంబున నుందురు సుఖమున వైష్ణవులు |
కప్పినశ్రీవేంకటపతిదాసులు కర్మవిదూరులు సాత్వికులు |
చెప్పకుడితరులసరిగా వీరికి సేవించగ నేధన్యుడనైతి ||
.


Pallavi

|| nityulu muktulu nirmalacittulu nigamAMtavidulu vaiShNavulu|
satyamu vIrala SaraNanibradukarO sATiki benagaka jaDulAla ||

Charanams

|| sakalOpAyaSUnyulu samyagj~jAnulu |
akalaMkulu SaMKacakralAMCanulanniTa bUjyulu vaiShNavulu |
vokaTI gOraru vorula goluvaru vollaru brahmAdipaTTamulu |
akaTA vIralasariyana BapaMbArumataMbula pUtatOkalan ||

|| maMtrAMtarasAdhAnAMtaraMbulu mAninapuNyulu viraktulu |
yaMtrapumAyala boraluparulaku yeMtainA mokkaru vaiShNavulu |
taMtrapukAmakrOdhavidUrulu tamanijadharmamu vadalaru |
jaMtrapusaMsArulatO vIrala sariyani yeMcaga bApamayya ||

|| tapparu tamapaTTinavrata meppuDu daivamokkaDE gatiyanucu |
voppagutamapAtivratyaMbuna nuMduru suKamuna vaiShNavulu |
kappinaSrIvEMkaTapatidAsulu karmavidUrulu sAtvikulu |
ceppakuDitarulasarigA vIriki sEviMcaga nEdhanyuDanaiti ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.