Main Menu

Oddela Mokkevo (ఒద్దేల మొక్కేవో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 56 ; Volume No.5

Copper Sheet No. 10

Pallavi: Oddela Mokkevo (ఒద్దేల మొక్కేవో)

Ragam: Samantam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఒద్దేల మొక్కేవో వుద్ధవుడా తన-
ఉద్దండాలె చెల్లెనుద్దవుడా

చరణములు

1.ఊరూర వలపులుద్దవుడా నే-
మోరుతుమా యిక నుద్ధవుడా
ఊరడించ వచ్చేవు వుద్ధవుడా తన-
వూరట చెలుములుద్దవుడా

2.ఒప్పలర మావురిసిన పుం-
డ్లప్పలు వెట్టించె నుద్ధవుడా
చెప్పకు మమ్మిక చెలువుడాతడే
వొప్పివుంటే జాలు నుద్ధవుడా

3.గోపికల మమ్ము గూరిమిజిక్కించె-
నోపకింతేసి నేముద్ధవుడా
పై పై నే మమ్మింత ప్రాణము నిలుప-
నోపెగా తానైన నుద్ధవుడా

4.తెగి తన్ను గూడే తెరగు దలచి
యుగములైనవి ఉద్ధవుడా
పగటున మా మా ప్రాణము మాకిక-
నొగరే తీపాయె నుద్ధవుడా

5.చెల్లించె మాప్రేమ శ్రీ వేంకటేశుడు
వుల్లమలర నేడుద్ధవుడా
చల్లని కూటపు జనవిచ్చి మామా-
వొళ్లెల్ల జెనకె నుద్ధవుడా
.


Pallavi

oddEla mokkEvO vuddhavuDA tana-
uddamDAle cellenuddavuDA

Charanams

1.UrUra valapuluddavuDA nE-
mOrutumA yika nuddhavuDA
UraDimca vaccEvu vuddhavuDA tana-
vUraTa celumuluddavuDA

2.oppalara mAvurisina pum-
Dlappalu veTTimce nuddhavuDA
ceppaku mammika celuvuDAtaDE
voppivumTE jAlu nuddhavuDA

3.gOpikala mammu gUrimijikkimce-
nOpakimtEsi nEmuddhavuDA
pai pai nE mammimta prANamu nilupa-
nOpegA tAnaina nuddhavuDA

4.tegi tannu gUDE teragu dalaci
yugamulainavi uddhavuDA
pagaTuna mA mA prANamu mAkika-
nogarE tIpAye nuddhavuDA

5.cellimce mAprEma SrI vEmkaTESuDu
vullamalara nEDuddhavuDA
callani kUTapu janavicci mAmA-
voLlella jenake nuddhavuDA
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.