Main Menu

Padhmaakksa Mamathachea Baramu Nandhedha Manchu (పద్మాక్ష మమతచే బరము నందెద మంచు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. పద్మాక్ష | మమతచే – బరము నందెద మంచు
విఱ్ఱవీగుదుమయ్య – వెఱ్ఱిపట్టి
మాస్వతంత్రంబైన – మదము గండ్లకు గప్పి
మొగము పట్టదు కామ – మోహమునను
బ్రహ్మదేవుండైన – బైడిదేహము గల్గ
జేసివేయక మమ్ము – జెఱిచె నతడు
తుచ్ఛమైనటువంటి – తో లెమ్ముకలతోడి
ముఱికి చెత్తలు చేర్చి – మూట కట్టె

తే. నీ శరీరాలు పడిపోవు – టెఱుగ కేము
కాముకుల మైతి మిక మిమ్ము – గానలేము.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓపరమాత్మ!నరసింహస్వామీ!పద్మములవంటి నేత్రములు కలవాడా!నీ యందలి మోక్షప్రాప్తి కలుగుతుందని విర్రవీగెదము.స్వగర్వమనెడు పొర మా కండ్లను కప్పి కామ మోహములచే నిన్ను వీక్షింపలేకున్నాము.ఆ సృష్టికర్తయైన బ్రహ్మదేవుడుకూడ మాకు బంగారు మేను నీయలేదు.”అనగా మెరుగైన బుద్దినొసంగలేదని యర్థము”.నీచమైన ఎముకలు, తోలు, చర్మములో మురికినంతను చేర్చి ఈ కట్టెను మూటకట్టినాడు. ఈ దేహము అశాశ్వతమని తెలియక కామమోహితలమై చరించుచునాము.ఇక మిమ్ములను దర్శించుభాగ్యములేదాయె తండ్రీ!
.


Poem:
See. Padmaaksha | Mamatache – Baramu Namdeda Mamchu
Virxrxaveegudumayya – Verxrxipatti
Maasvatamtrambaina – Madamu Gamdlaku Gappi
Mogamu Pattadu Kaama – Mohamunanu
Brahmadevumdaina – Baididehamu Galga
Jesiveyaka Mammu – Jerxiche Natadu
Tuchcamainatuvamti – To Lemmukalatodi
Murxiki Chettalu Cherchi – Moota Katte

Te. Nee Sareeraalu Padipovu – Terxuga Kemu
Kaamukula Maiti Mika Mimmu – Gaanalemu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. padmaakSha | mamatachE – baramu naMdeda maMchu
virxrxaveegudumayya – verxrxipaTTi
maasvataMtraMbaina – madamu gaMDlaku gappi
mogamu paTTadu kaama – mOhamunanu
brahmadEvuMDaina – baiDidEhamu galga
jEsivEyaka mammu – jerxiche nataDu
tuchCamainaTuvaMTi – tO lemmukalatODi
murxiki chettalu chErchi – mooTa kaTTe

tE. nee Sareeraalu paDipOvu – Terxuga kEmu
kaamukula maiti mika mimmu – gaanalEmu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.