Main Menu

Pakkshivaahana Neanubrathikinannidhinaalu (పక్షివాహన నేనుబ్రతికినన్నిదినాలు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. పక్షివాహన | నేను – బ్రతికినన్నిదినాలు
కొండెగాండ్రను గూడి – కుమతినైతి
నన్నవస్త్రము లిచ్చి – యాదరింపుము నన్ను
గన్నతండ్రివి నీవె – కమలనాభ |
మరణ మయ్యెడినాడు – మమతతో నీయొద్ది
బంట్ల దోలుము ముందు – బ్రహ్మజనక |
ఇనజభటావళి – యీడిచికొనిపోక
కరుణతో నాయొద్ద – గావ లుంచు

తే. కొసకు నీ సన్నిధికి బిల్చు – కొనియు నీకు
సేవకుని జేసికొనవయ్య – శేషశయన |
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరశింహా!పక్షివాహనా!బ్రతికినన్నాళ్ళు చెడ్డవారితో గూడి చెడుస్నేహములు చేసి దుర్బుద్దితో దుర్మార్గుడనైనాను. ఓ కమలనాభ! నన్ను గన్నతండ్రివి నీవే అన్న వస్త్రములిచ్చి ఆదరింపుము తండ్రీ! ఓ బ్రహ్మపితా! నేను మరణించిన తోడనే ముందుగా నీ భటులు వచ్చునట్లు చూడుము తండ్రీ!యమభటులొచ్చి నన్ను యీడ్చుకొని పోకముందే నీ భటులను దయతో నావద్ద కావలి ఉంచుము కరుణహృదయా! చివరకు నీ సన్నిథికి కొనిపోయి నన్ను నీ సేవకునిగా జేసికొనవయ్య ఓ భుజగశయనా!
.


Poem:
See. Pakshivaahana | Nenu – Bratikinannidinaalu
Komdegaamdranu Goodi – Kumatinaiti
Nannavastramu Lichchi – Yaadarimpumu Nannu
Gannatamdrivi Neeve – Kamalanaabha |
Marana Mayyedinaadu – Mamatato Neeyoddi
Bamtla Dolumu Mumdu – Brahmajanaka |
Inajabhataavali – Yeedichikonipoka
Karunato Naayodda – Gaava Lumchu

Te. Kosaku Nee Sannidhiki Bilchu – Koniyu Neeku
Sevakuni Jesikonavayya – Seshasayana |
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. pakShivaahana | nEnu – bratikinannidinaalu
koMDegaaMDranu gooDi – kumatinaiti
nannavastramu lichchi – yaadariMpumu nannu
gannataMDrivi neeve – kamalanaabha |
maraNa mayyeDinaaDu – mamatatO neeyoddi
baMTla dOlumu muMdu – brahmajanaka |
inajabhaTaavaLi – yeeDichikonipOka
karuNatO naayodda – gaava luMchu

tE. kosaku nee sannidhiki bilchu – koniyu neeku
sEvakuni jEsikonavayya – SEShaSayana |
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.